Breakfast Recipe : ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచే.. బ్రోకలీ ఓట్స్ స్మూతీ
Broccoli Oats Smoothie : బ్రోకలీ ఓట్స్ స్మూతీ బౌల్ అల్పాహారం కోసం ఆరోగ్యకరమైనది. హెల్తీ ఫుడ్‌తో రోజును ప్రారంభించడం మీ శరీరానికి మీరు చేయగలిగిన ఉత్తమమైన పని. పైగా ఈ స్మూతీ మీ రోజువారీ పోషకాహార అవసరాలన్నింటినీ తీరుస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
Broccoli Oats Smoothie : బ్రోకలీ ఓట్స్ స్మూతీ బౌల్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. మీ వీకెండ్ టైమ్‌లో లేట్‌గా లేచినా.. దీనిని త్వరగా తయారు చేసుకోవచ్చు. పైగా మీ బ్రేక్‌ఫాస్ట్‌లో తక్కువ కేలరీలు, శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు పొందవచ్చు. కాబట్టి మీరు ఎక్కువసేపు నిండుగా అనుభూతి చెందుతారు. మరి ఈ హెల్తీ రెసిపీనీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బ్రోకలీ - 1 కప్పు (ఉడకబెట్టాలి)
* పాలు - 3/4 కప్పు
* పెరుగు - 1 కప్పు
* వోట్స్ - 1/4 కప్పు
* తేనె - మీ రుచికి తగ్గట్లు
* నచ్చిన పండ్లు - మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు
* డ్రై ఫ్రూట్స్ - మీ టేస్ట్ తగ్గట్లు (తరగాలి)
బ్రోకలీ ఓట్స్ స్మూతీ తయారీ విధానం
బ్రోకలీ ఓట్స్ స్మూతీ బౌల్‌ను తయారు చేయడం ప్రారంభించడానికి.. ముందుగా బ్లెండర్‌లో ఉడికించిన బ్రోకలీ, పాలు, పెరుగు, ఓట్స్, తేనెను వేసి బ్లెండ్ చేయాలి.
అన్ని బాగా కలిసి.. స్మూతీలా తయారయ్యే వరకు బ్లెండ్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి బదిలీ చేయండి. దానిలో మీకు నచ్చిన పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించండి. అంతే సింపుల్ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ. హ్యాపీగా లాగించేయండి. హెల్తీగా ఉండండి.