తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Butterfly Tea | నీలి రంగు ఛాయ్.. ఒక్క కప్ తాగితే చాలు, అది చేస్తుంది ఎంతో మేలు!

Butterfly Tea | నీలి రంగు ఛాయ్.. ఒక్క కప్ తాగితే చాలు, అది చేస్తుంది ఎంతో మేలు!

HT Telugu Desk HT Telugu

08 May 2022, 7:06 IST

google News
    • Butterfly pea flower tea- చూడటానికి నీలి రంగులో ఉంటుంది. ఇది ఒక హెర్బల్ టీగా పనిచేస్తుంది. ఈ టీ చేసుకోడానికి ఏం కావాలి, ఎలా చేసుకోవాలో రెసిపీని ఇక్కడ చూడండి..
Blue Tea
Blue Tea (Unsplash)

Blue Tea

చాలా మందికి ఉదయం ఛాయ్ లేనిదే రోజు ప్రారంభం కాదు. మన ఇండియాలో ఎన్నో రకాల ఛాయ్ వెరైటీలు అందుబాటులో ఉంటాయి. అయితే ఆరోగ్యంపైన శ్రద్ధ ఉన్నవారు, ఫిట్ నెస్ కోరుకునేవారు ఎక్కువగా హెర్బల్ టీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ హెర్బల్ టీల లోనూ ఎన్నో వెరైటీలు ఉన్నాయి అందులో ఒక వెరైటీ.. బటర్ ఫ్లై టీ. దీనినే బ్లూ టీ అని కూడా అంటారు. ఈ ఛాయ్ చూడచక్కని నీలిరంగులో ఉంటుంది. దీని కలర్ ఒక హైలైట్ అయితే, ఇది తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా హైలైట్. అంతేకాదు ఇది చేసుకోవడం చాలా తేలిక, దీనికి ఛాయ్ పత్తి కూడా అవసరం లేదు. మరి ఈ బ్లూటీ ఎలా చేసుకోవాలి? ఏమేం కావాలో ఇక్కడ తెలుసుకోండి.

బ్లూటీకి కావాల్సినవి

  • 1 కప్పు నీరు
  • 10 శంఖ పూలు (అపరాజిత పూలు)
  • తీపి కోసం తేనే లేదా చక్కెర

ముందుగా..

ముందుగా శంఖ పూలను సేకరించాలి. ఈ పూలు ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. ఈ శంఖపూల మొక్కలు ఎక్కడైనా మొలకెత్తుతాయి.

ఇలా శంఖపూలను సేకరించి 2-3 రోజుల పాటు ఎండ బెట్టుకొని ఆ తర్వాత ఏదైనా సీసాలో నిల్వ చేసుకోవాలి.

తయారీవిధానం

  1. ఒక కప్పు నీటిని వేడిచేసి అందులో 10 శంఖ పూలను వేయాలి. ఆ తర్వాత 15 నిమిషాలు పక్కనపెట్టుకోవాలి.
  2. శంఖపూలలోని నీలి వర్ణద్రవ్యం అంతా నీటిలోకి చేరి ఆ నీరంతా నీలిరంగులోకి మారుతుంది.
  3. ఇప్పుడు శంఖపూలను వడకట్టి ఆ నీలి నీటిలో తేనే లేదా చక్కెర కలుపుకోవాలి. అంతే బ్లూటీ సిద్దమైనట్లే.
  4. ఈ బ్లూటీని గోరువెచ్చగా తాగండి.

ఆరోగ్య ప్రయోజనాలు

బ్లూటీ అనేది కెఫిన్ లేని ఒక ఆయుర్వేద మూలికా ద్రావణంగా చెప్పవచ్చు. దీని ఒక కప్పు టీ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. రిలాక్స్ గా అనిపిస్తుంది. ఏదైనా పని ప్రారంభించటానికి మంచి ఉత్సాహం లభిస్తుంది. హెర్బల్ డ్రింక్ కావడంతో శరీర బరువును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా, మూత్రం సజావుగా వస్తుంది, మలినాలు తొలగిస్తుంది, రక్తంలో గ్లూకోజు స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం