Summer Fashion | అమ్మాయిలు సమ్మర్లో వీటిని ట్రై చేయండి.. ఫ్యాషన్ లుక్ పక్కా..
06 May 2022, 13:29 IST
- సమ్మర్లో ఇంట్లోనే ఉండాలి అనిపిస్తుంది. కానీ బయటకు వెళ్లాల్సి వస్తే ముందు భయపడేది ఏ డ్రెస్ వేసుకోవాలి అనే. ఎందుకంటే మనం బాగుంటామనిపించే డ్రెస్‌లు వేడిని ఎక్కువ ఇస్తాయి. పోని ఇంకేమైనా వేసుకుంటే అవి అంత ఫ్యాషన్‌గా ఉండవు. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. ఈ తరహా దుస్తులు మిమ్మల్ని వేడి నుంచి రక్షించడమే కాకుండా ఫ్యాషన్‌గా కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సమ్మర్ ఫ్యాషన్
Summer Fashion | వేసవి మనందరిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. బయట అడుగు పెడుతుంటే చాలు సూర్యుని భగభగలు మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఇంట్లో ఉన్నా సరే వేడి ఎక్కువైపోతుంది. ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. కానీ వెళ్లాల్సివస్తే ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి. కొన్ని దుస్తులు మనకి చికాకును పెంచుతాయి. కాబట్టి అమ్మాయిలు మీకోసమే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీ డే అవుట్ సమయంలో మీకు ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఓ లుక్కేయండి.
భారీ చొక్కాలు
చాలా మంది ఏ సీజన్‌లో అయినా భారీ చొక్కాలను ఇష్టపడతారు. వీటికి వేసవిలో మరింత ప్రాధాన్యతనిస్తారు. భారీ షర్టులు మీరు సొగసైన వారిలా కనిపించేలా చేస్తాయి. ఓ భారీ చొక్కాకు జీన్స్, బూట్లతో పెయిర్ అప్ చేస్తే.. మీ లుక్ అదిరిపోతుంది అంతే. ఈ భారీ షర్ట్‌కు రిలాక్స్డ్ ప్యాంటు జత చేసి.. బయటకు వెళ్లిపోండి.
డెనిమ్ స్కర్ట్స్
ప్రతిరోజూ ప్యాంటు వేసుకోవడం ఇబ్బందిహా ఉంటుంది. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ప్యాంటు ధరించడం సాహసమనే చెప్పాలి. ఎందుకంటే.. వేసవిలో ప్యాంటులు వేడిని విడుదల చేసి.. శరీరానికి ఇబ్బందిని కలిగిస్తాయి. అలాంటప్పుడు డెనిమ్ స్కర్ట్స్ మీకు మంచి ఎంపిక. డెనిమ్ స్కర్ట్స్ అనేక రంగులలో మీకు దొరుకుతాయి. మీ రెగ్యులర్ లుక్‌కి డెనిమ్ స్కర్ట్స్‌తో టాటా చెప్పొచ్చు.
బాటమ్‌లతో బ్రాలెట్
అధునాతనమైన సౌకర్యవంతమైన బ్రాలెట్‌లను మ్యాచింగ్ జీన్స్, స్కర్ట్‌లు లేదా ప్యాంటుతో సులభంగా జత చేయవచ్చు. వేసవికాలం కోసం ఇవి మంచి ఎంపిక. దేనితోనైనా దీనిని పెయిర్ చేయవచ్చు కాబట్టి.. ఆర్థికంగా కూడా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకు లేత-రంగు బ్రాలెట్‌తో తెల్లటి చొక్కా ధరించండి. దానికి డెనిమ్ బాటమ్‌లతో జత చేసి.. దానిని మీ సోషల్ మీడియాలో రెడీ అవుట్‌ఫిట్ ఆఫ్ ది డే (OOTD)గా చేసుకోవచ్చు.
కార్గోస్, క్రాప్ టాప్స్
కార్గోస్ అనేది ఫ్యాషన్ పరిశ్రమలో పునరావృతమవుతూనే ఉంది. ప్రస్తుతం ఇవి మళ్లీ తిరిగి వచ్చి.. ప్రాచుర్యం పొందుతున్నాయి. మంచి, మృదువైన షేడెడ్ క్రాప్ టాప్‌తో దీనిని జత చేస్తే లుక్ అదిరిపోద్ది. బిజీగా ఉండే సాహసోపేతమైన రోజు కోసం కార్గో ప్యాంటు సరైన ఎంపిక.