తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  No Cooking Recipe | చిటికెలో బ్రేక్​ఫాస్ట్ రెడీ.. పైగా ఇది తింటే బరువు తగ్గుతారు

No Cooking Recipe | చిటికెలో బ్రేక్​ఫాస్ట్ రెడీ.. పైగా ఇది తింటే బరువు తగ్గుతారు

HT Telugu Desk HT Telugu

07 May 2022, 7:53 IST

    • గంటలు గంటలు కిచెన్​లో గడపకుండా.. చిటికెలో తయారైపోయే హెల్తీ బ్రేక్​ ఫాస్ట్​ను ఎవరు కాదనగలరు. పైగా కేలరీలు తక్కువున్న ఫుడ్​కి అస్సలు నో కూడా చెప్పలేము. ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఈ రెసిపీ.. మీ టమ్మీని ఫుల్ చేస్తుంది. ఎక్కువ సేపు ఆకలికాకుండా శక్తిని ఇస్తుంది. మరి ఆ క్విక్​ రెసిపీ ఏంటో చూసేద్దామా?
హెల్తీ బ్రేక్ ఫాస్ట్
హెల్తీ బ్రేక్ ఫాస్ట్

హెల్తీ బ్రేక్ ఫాస్ట్

Protein And Fiber Packed Recipe | చాలా మంది హెల్త్​ కోసం, ఫిట్​నెస్​ కోసం మొలకెత్తిన విత్తనాలు తింటారు. కానీ వాటిని రోజూ తినాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే దానిలో టేస్ట్​ ఉండదు కాబట్టి. అయితే మీరు కూడా స్ప్రౌట్స్ తిని బోర్​గా ఫీల్​ అయ్యేవారే అయితే ఈ రెసిపీ మీకోసమే. ఈ మొలకెత్తిన విత్తనాలను వండకుండా.. దానిలోని ప్రోటీన్స్ పోకుండా.. టేస్టీగా తయారు చేసే రెసిపీ ఇదే. గంటలు గంటలు దీని గురించి కష్టపడనవసరం లేదు కూడా. ఇంతకీ అదెంటో.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

కావాల్సిన పదార్థాలు

శెనగలు - అరకప్పు (నానబెట్టినవి)

పెసలు - పావు కప్పు (నానబెట్టినవి)

ఉల్లిపాయ - 1 చిన్నది (తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి -1 (ముక్కలు కోయాలి)

టమాట - 1 (ముక్కలు చేసి పెట్టాలి)

కొత్తిమీర - తగినంత

నిమ్మరసం - 1 స్పూన్

ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం

ఓ గిన్నె తీసుకుని దానిలో శెనగలు, పెసలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే చాలా సింపుల్ రెసిపీ కదా. దీనిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకున్నా ఇది హెల్త్​కి మంచి చేస్తుంది. ఈ రెసిపీలో టమాటాలతో పాటు ఇతర కూరగాయలు మీకు నచ్చినవి వేసుకోవచ్చు. కీరదోస వేసుకుంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి.

ప్రోటీన్ ఫైబర్ పూర్తిగా నిండిన క్విక్ రెసిపీ ఇది. శెనగలు పూర్తిగా ఫైబర్, ప్రోటీన్​లతో నిండి ఉంటాయి. ఇవి మీ కడుపు నిండేలా చేసి.. ఎక్కువ సేపు మీరు ఆకలి కాకుండా చూస్తాయి. దీనిని బ్రేక్​ఫాస్ట్​, లంచ్​ బాక్స్, హెల్తీ స్నాక్స్, మీల్స్ మధ్యలో కూడా తీసుకోవచ్చు. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పవర్ ప్యాకేజ్​ అని చెప్పవచ్చు. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. పైగా ఎక్కువ సేపు ఆకలి కలగకుండా చేస్తాయి కాబట్టి.. బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా దీనిని తమ డైట్​లో కలిపి తీసుకోవచ్చు.

టాపిక్