Cinnamon Tea Recipe : రక్తంలో చక్కెర స్థాయిలను, గుండె జబ్బులను తగ్గించే.. దాల్చిన చెక్క టీ
Cinnamon Tea Recipe : దాల్చినచెక్కను ఎన్నో ఏళ్లుగా భారతీయ వంటలలో ఉపయోగిస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆయుర్వేదంలో కూడా దీనిని ఎక్కువగా వాడతారు. దీని ప్రయోజనాలు పొందాలంటే దాల్చిన చెక్క టీను కూడా తీసుకోవచ్చు అంటున్నారు. మీరు టీ లవర్ అయితే.. హెల్తీ టీని మీ రోజూవారి జీవితంలో భాగం చేసేసుకోండి.
Cinnamon Tea Recipe : దాల్చిన చెక్క అధిక యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న బహుముఖ ఔషధం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. న్యూరో డిజెనరేటివ్ వ్యాధులను నివారించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. క్యాన్సర్ నుంచి రక్షించడంలో,డయాబెటిక్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయం చేసే దీనిని మీరు మీ రోజూవారీ జీవితంలో భాగం చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు దాల్చిన చెక్క టీ ట్రై చేయవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. మరి దీనిని కావాల్సన పదార్థాలు ఏమిటో? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* పాలు - 2 కప్పులు
* చక్కెర - 2 స్పూన్స్
* దాల్చిన చెక్క - అంగుళం
* ఏలకుల పొడి - చిటికెడు
* టీ పౌడర్ - 2 స్పూన్స్
* నీరు - ½ కప్పు
తయారీ విధానం..
దాల్చిన చెక్క టీని తయారు చేయడానికి.. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టండి. దానిలో అరకప్పు నీళ్లు పోసి మరిగేటప్పుడు రెండు టీ స్పూన్ల టీ పౌడర్ వేయండి. దానిని రెండు నిమిషాలు అలాగే ఉండనివ్వండి. అది మరిగేటప్పుడు కేవలం రెండు టీ స్పూన్ల చక్కెర వేసి బాగా కలపండి.
అనంతరం ఒకటి లేదా రెండు చిటికెడు యాలకుల పొడితో పాటు ఒక అంగుళం దాల్చిన చెక్క వేసి మరగనివ్వండి. దానినుంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. టీ ఫిల్టర్‌తో టీని వడకట్టండి. రెండు నిమిషాల తర్వాత.. రెండు కప్పుల కాచిన వేడి వేడి పాలు పోసి చక్కగా కలపండి. అంతే వేడే వేడి దాల్చిన చెక్క టీ రెడీ. దీనిని మీరు అలాగే తాగేయొచ్చు లేదా బిస్కెట్స్, స్నాక్స్‌తో లాగించేయవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్