Dry fruits for diabetes: డయాబెటిస్ ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తినొచ్చా?
Dry fruits for diabetes: డయాబెటిస్ ఉన్న వారు డ్రైఫ్రూట్స్ తింటే రక్తంలో గ్లూకోజు లెవెల్స్ పెరుగుతాయా?
Dry fruits for diabetes: డయాబెటిస్ పేషెంట్లు రోజువారీ జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది? పండ్లు తినొచ్చా? డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? వంటి సవాళ్లు ఎదురవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు డ్రైఫ్రూట్స్ నిరభ్యంతరంగా తినొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, అత్తి పండ్లు, ఆప్రికాట్లు వంటి డ్రైఫ్రూట్స్ మార్కెట్లో సులువుగా లభ్యమవుతాయి.
డ్రైఫ్రూట్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు మాత్రమే కాకుండా కెరొటినాయిడ్స్, ఫైటో స్టెరాల్స్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. డ్రైఫ్రూట్స్‌లో సాధారణ పండ్ల కంటే కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని, ఫైబర్ ఎక్కువగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.
అయితే మధుమేహం ఉన్న వారు తరచూ అనుమానపడుతుంటారు. చుట్టూఉన్న వారు కూడా ఏదో ఒక సలహా ఇస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగలకు గిఫ్ట్ ఇచ్చే సంస్కృతి పెరిగిపోయింది. దీపావళి, నూతన సంవత్సరం వంటి వేడుకలకు డ్రైఫ్రూట్స్ కానుకలుగా ఇస్తున్నారు. అందులో అత్తి పండ్లు, బాదాం, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటివి ఉంటాయి.
ఎండు ద్రాక్ష తీయగా ఉన్నా ఎలాంటి ముప్పు లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం లేకపోగా, ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరిస్తున్నారు. అయితే వీటిని మితంగా తినాలి. ఖర్జూరాలు కూడా మితంగా తినాలి. లేదంటే అధిక క్యాలరీలతో బరువు పెరగడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మరింత పెరుగుతాయి.
అలాగే అంజీర్ (అత్తి పండ్లు) తినడం వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతంగా ఏమీ పెరగవు. వీటిని రాత్రిపూట పాలల్లో నానబెట్టుకుని ఉదయం పూట తినడం వల్ల మీకు తగినంత ప్రోటీన్ లభిస్తుంది. అథ్లెట్లు కూడా వీటిని తీసుకుంటారు.
బాదాములు కూడా రాత్రి పూట నానబెట్టి ఉదయం తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనం ఇదివరకే తెలుసుకున్నాం. డయాబెటిస్ పేషెంట్లు తరచుగా ఎదుర్కొనే కండరాల సమస్యలకు బాదాంల నుంచి పరిష్కారం కూడా లభిస్తుంది. బాదాంలు గింజ జాతికి చెందినవి. అయితే మనం వీటిని డ్రైఫ్రూట్స్‌లో ఒకటిగానే చూస్తుంటాం.
కాస్త శారీరక శ్రమ ఉన్న వారు నిరభ్యంతరంగా భోజనానికి భోజనానికి మధ్య విరామ సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మేలు చేస్తుంది. డ్రైఫ్రూట్స్ మోతాదు మించితే అసలుకే మోసం వస్తుంది.