Almonds health benefits: బాదాంతో ఆశ్చర్యకర ఫలితాలు.. తాజా స్టడీ తేల్చిందిదే-surprising health benefits of eating a handful of almonds every day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Almonds Health Benefits: బాదాంతో ఆశ్చర్యకర ఫలితాలు.. తాజా స్టడీ తేల్చిందిదే

Almonds health benefits: బాదాంతో ఆశ్చర్యకర ఫలితాలు.. తాజా స్టడీ తేల్చిందిదే

HT Telugu Desk HT Telugu
Nov 22, 2022 04:13 PM IST

Almonds health benefits: వింటర్ సీజన్ వచ్చేసింది. గుండె పోట్లకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీ గుండెకు మేలు చేసే బాదాం గురించి వివరాలు..

గుప్పెడు బాదాములతో మీ గుండె పదిలం
గుప్పెడు బాదాములతో మీ గుండె పదిలం (Pixabay)

రోజూ కొన్ని బాదంపప్పులు.. అంటే 20-22 బాదాం గింజలు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. బాదం పప్పులో ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, పొటాషియం, జింక్, బి విటమిన్లు, నియాసిన్, థయామిన్, ఫోలేట్ కూడా ఉన్నాయి. అవి గుండె, కొలెస్ట్రాల్‌కు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ కూడా కలిగి ఉన్నాయి.

నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రధాన దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ వంటివి వచ్చే ఆస్కారాన్ని తగ్గిస్తాయని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన తెలిపింది.

రోజూ గుప్పెడన్ని నట్స్ తీసుకునే వారిలో తీసుకోని వారితో పోలిస్తే క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర వ్యాధుల కారణంగా చనిపోయే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది.

శీతాకాలంలో మీ ఆకలి పెరుగుతుంది. బాదాం పప్పు మీ భోజనానికి భోజనానికి మధ్య సమయంలో స్నాక్స్‌గా ఉపయోగపడుతుంది. అద్భుతమైన పోషకాలు ఉన్న బాదాం పప్పును సూపర్ ఫుడ్‌గా చెబుతారు. వీటిని నానబెట్టుకుని గానీ, రోస్ట్ చేసుకుని గానీ తినొచ్చు. స్మూతీస్, హల్వా, యోగర్ట్‌లో కూడా చేర్చుకుని తినొచ్చు. ఆల్మండ్ మిల్క్ మీ డెయిరీ ఉత్పత్తుల అవసరాలను తీర్చుతుంది. ఇలా తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీలు కలిగి ఉండడమే కాకుండా అధిక ప్రోటీన్ కలిగి ఉంటుంది.

‘బాదాం పప్పులు మనకు పండగలకు చేసుకునే స్నాక్స్‌ను గుర్తుకు తెస్తాయి. చాలా మంది బాదాం పప్పును తినడానికి భయపడతారు. అందులో దాదాపు 50 శాతం ఫ్యాట్ ఉంటుందని తినడానికి సందేహిస్తారు. అయితే ఇందులో భయడాల్సిన పనేం లేదు. మూడింట రెండొంతుల కొవ్వు మంచి చేసేదే..’ అని న్యూట్రీషనిస్టు కరిష్మా షా చెప్పారు.

Almonds reduce cholesterol: కొలెస్ట్రాల్‌ను తగ్గించే బాదాం

బాదాం మీ బ్లడ్ సెల్స్‌లో విటమిన్ ఇ నిల్వలను పెంచుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని తేలింది. కొలెస్ట్రాల్ ప్రభావాలను కూడా తగ్గిస్తుందని తేలింది. అందువల్ల రోజూ గుప్పెడన్నీ బాదాములు తింటే కొలెస్ట్రాల్ బాధ తగ్గుతుంది.

గుండెకు మంచిది

ఇతర నట్స్‌తో కలిపి బాదాం గింజలు తీసుకుంటే అది మీ గుండెకు మేలు చేస్తుంది. ఆల్మండ్స్ తినే వారి రక్తంలో అధిక యాంటీఆక్సిడంట్లు ఉండి బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించడంలో సాయపడతాయని తేలింది. అలాగే శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడినట్టు తేలింది. సమతుల ఆహారంలో అధికంగా నట్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనం తేల్చింది.

sugar levels: షుగర్‌ను అదుపులో ఉంచే ఆల్మండ్స్

బాదాంలను తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఆల్మండ్స్‌లో అధిక మెగ్నీషియం ఉండడం వల్ల ఇది సాధ్యపడుతుంది. డయాబెటిస్ టైప్ 2 తో బాధపడుతున్న వారు రోజూ గుప్పెడు బాదాములను తినేలా చూసుకోవాలి. తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ పెంచి డయాబెటిస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

blood pressure levels: బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించే ఆల్మండ్స్

మెగ్నిషియం తక్కువ స్థాయిల్లో ఉన్నప్పుడు హై బ్లడ్ ప్రెజర్‌కు దారితీస్తుంది. ఇది హార్ట్ అటాక్‌కు దారితీస్తుంది. స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది. ఆల్మండ్స్ అధిక మెగ్నీషియం కలిగి ఉండడం మూలంగా బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. మీ శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే ఆల్మండ్స్‌ను మీ డైట్‌లో చేర్చండి.

WhatsApp channel