Superfoods for Your Heart : గుండె సమస్యలకు దూరంగా ఉండాలంటే.. వీటిని తినండి..
Superfoods for Your Heart : ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు.. వివిధ కారణాల వల్ల గుండె సమస్యలు పెరుగుతున్నాయి. ఆహార రుగ్మతలు, ఒత్తిడి కూడా ఈ సమస్యలకు ఆజ్యం పోస్తున్నాయి. అందుకే 40 ఏళ్లలోపు వారిలో కూడా గుండెపోటు ముప్పు భారీగా పెరుగుతోంది. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
Superfoods for Your Heart : వయసు పెరిగే కొద్దీ గుండె సామర్థ్యం తగ్గుతుంది. వయసుతో పాటు.. చాలా మంది తమ గుండెపై ఒత్తిడిని తెచ్చుకుంటారు. దీనివల్లే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలున్నాయని అంటున్నారు నిపుణులు. అవి గుండె ప్రమాదాన్ని తగ్గిస్తాయి అంటున్నారు. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయసు పెరిగినా.. గుండెపై ఒత్తిడి పెద్దగా ఉండదు అంటున్నారు. మరి ఆ ఫుడ్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
విత్తనాలు
మీ రోజువారీ ఆహారంలో వివిధ రకాల విత్తనాలను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాలు గుండెకు మేలు చేస్తాయి. అందువల్ల వివిధ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది అంటున్నారు.
చేపలు, చేప నూనె
చేపలు, చేప నూనెలో కూడా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చేపలను రెగ్యులర్గా తినేవారిలో హృదయనాళ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. చేపలను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కూరగాయలు
శీతాకాలం వస్తోంది. ఈ సమయంలో ఆకుపచ్చని కూరగాయలు మార్కెట్‌లో తాజాగా దొరుకుతాయి. అటువంటి కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం గుండెకు మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. దాని ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
వివిధ రకాల బెర్రీలు
స్ట్రాబెర్రీలు ఇప్పుడు వేసవి దేశాల్లో కూడా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. ఇది కాకుండా, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు గుండెకు చాలా మేలు చేస్తాయి. అటువంటి బెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది.
తృణధాన్యాలు
తృణధాన్యాలు శరీరానికి మేలు చేస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా ఈ రకమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటికే వివిధ రకాల గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రకమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తినవచ్చు.
సంబంధిత కథనం