PCOS Relief : హార్మోన్ల సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ఈ విత్తనాలు తినండి..-seed cycle for hormonal balance and pcos relief ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Seed Cycle For Hormonal Balance And Pcos Relief

PCOS Relief : హార్మోన్ల సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ఈ విత్తనాలు తినండి..

Jul 19, 2022, 02:29 PM IST Geddam Vijaya Madhuri
Jul 19, 2022, 02:29 PM , IST

  • హార్మోన్ల సమస్యలను ఎక్కువగా మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా పీసీఓఎస్, బరువు పెరగడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉంటే కచ్చితంగా డాక్టర్​ను సంప్రదించాల్సిందే. అయితే కొన్ని విత్తనాలతో హార్మోన్ల సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

చాలా మంది మహిళలు PCOS, హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారు. దీనివల్ల బరువు కూడా పెరిగిపోతున్నారు. అయితే ఈ సమస్యలన్నీ కొన్ని విత్తనాలతో పరిష్కరించవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.

(1 / 10)

ఇప్పుడు చాలా మంది తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్, విత్తనాలను స్నాక్స్‌గా తీసుకుంటున్నారు. విత్తనాలలో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. పోషకాహార నిపుణులు కూడా ఆహారంలో విత్తనాలను చేర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అంతే కాదు, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా PCOS లక్షణాలను నియంత్రించడంలో కూడా విత్తనాలు సహాయపడతాయి.

(2 / 10)

విత్తనాలు ఆరోగ్యకరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. మన శరీరం వాటిని స్వయంగా తయారు చేసుకోదు. కానీ అవి శరీరం పనితీరుకు చాలా ముఖ్యమైనవి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి, వ్యాయామం. ఈ మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి అని తాజా అధ్యయనం పేర్కొంది.

(3 / 10)

రాగి, జింక్, విటమిన్ ఇ వంటివి వివిధ విత్తనాలలో పెద్ద మొత్తంలో కనిపిస్తాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. ఈ విత్తనాలు ముఖ్యంగా మహిళలకు చాలా ప్రభావవంతంగా ఉపయోగపడతాయి.

(4 / 10)

కానీ విత్తనాలు తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కేవలం విత్తన చక్రంలోనే వాటిని తినాలి అంటున్నారు ఆహార నిపుణలు. మరి విత్తనాలు ఎలా తినాలో, ఏ నియమాలల్లో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

(5 / 10)

సీజన్‌లో మొదటి దశ (1వ రోజు నుంచి 14వ రోజు), రెండవ దశ (14 నుంచి 28వ రోజు) వరకు కొన్ని రకాల విత్తనాలను తినడం ద్వారా హార్మోన్ల సమతుల్యత నియంత్రించవచ్చు అంటున్నారు. ఇది మొటిమలు, జుట్టు రాలడం, బహిష్టు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

(6 / 10)

విత్తనాలలో గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు, జనపనార గింజలు, చియా విత్తనాలు ఉన్నాయి. విత్తన చక్రంపై శాస్త్రీయ పరిశోధన లేదు. అయినప్పటికీ ప్రజలు చాలా కాలంగా వాటిని వినియోగిస్తున్నారు. వీటివల్ల ఏ హాని లేదు కాబట్టి.. ఈ విత్తనాలను తినవచ్చు.

(7 / 10)

విత్తన చక్రం దశ 1: ప్రతిరోజూ ఒక చెంచా పచ్చి గుమ్మడి గింజలు, ఒక చెంచా అవిసె గింజలను తినాలి. చాలా మంది విత్తన చక్రంలో మొదటి దశను 2 వారాల పాటు కొనసాగిస్తారు.

(8 / 10)

ఋతు చక్ర రెండవ దశ: ఈ సందర్భంలో ప్రతిరోజూ 1 టీస్పూన్ పచ్చి పొద్దుతిరుగుడు గింజలు, ఒక టీస్పూన్ పచ్చి నువ్వుల గింజలను తీసుకోండి. రెండవ దశ (14 నుంచి 28వ రోజు)లో వీటిని తీసుకోవాలి.

(9 / 10)

ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యతను అదుపులో ఉంచుకోవచ్చు. కానీ ఏదైనా ఔషధం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలని మరచిపోవద్దు.

(10 / 10)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు