తెలుగు న్యూస్  /  Lifestyle  /  Cucumber Curd Rice A Perfect Summer Lunch Recipe

Cucumber Curd Rice Recipe । సమ్మర్ డైట్‌లో కమ్మని లంచ్ రెసిపీ.. దోసకాయ పెరుగు అన్నం!

HT Telugu Desk HT Telugu

28 April 2023, 13:17 IST

    • Cucumber Curd Rice Recipe: ఎండాకాలంలో లంచ్ లోకి ఏది తినాలనిపించడం లేదా? మీ కడుపులో చల్లగా, తేలికగా ఉండే దోసకాయ పెరుగు అన్నం రెసిపీ ఇక్కద ఉంది. ఇది ఒకసారి తిని చూడండి.
Cucumber Curd Rice Recipe
Cucumber Curd Rice Recipe (slurrp)

Cucumber Curd Rice Recipe

Cool Summer Recipes: ఈ వేసవిలో మధ్యాహ్న భోజనంగా తేలికగా ఉండే అహారాన్ని స్వీకరించాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ రెసిపీ. సమ్మర్ డైట్‌లో కచ్చితంగా పెరుగు, దోసకాయలు వంటి చలువ చేసే ఆహారాలను చేర్చుకోవడం చాలా మంచిది. ఈ రెండూ కలగలిసిన దోసకాయ పెరుగు అన్నం రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ వంటకం చేయడానికి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు, సంక్లిష్టమైన దశలు లేవు. తక్కువ పదార్థాలతో కేవలం 10-15 నిమిషాల్లో ఈ వంటకం సిద్ధం అయిపోతుంది. ఇది ఈ వేడి సీజన్ లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. మీరూ ఓ సారి ప్రయత్నించి చూడండి. ఎలా చేయాలో ఈ కింద సూచనలు అనుసరించండి.

Cucumber Curd Rice Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు అన్నం
  • 1 కప్పు పెరుగు
  • 1/2 కప్పు దోసకాయ తురుము
  • 1 టేబుల్ స్పూన్ కరివేపాకు
  • 1-2 ఎండుమిర్చి
  • 2-3 టేబుల్ స్పూన్లు దానిమ్మ గింజలు
  • 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ
  • 1 స్పూన్ నల్ల మిరియాలు పొడి
  • 1 స్పూన్ జీలకర్ర
  • 1/2 టీస్పూన్ ఇంగువ
  • 1-2 స్పూన్ నెయ్యి
  • రుచి ప్రకారం ఉప్పు
  • కొద్దిగా కొత్తిమీర తురుము

దోసకాయ పెరుగు అన్నం ఎలా తయారు చేయాలి

  1. ముందుగా దోసకాయను కడిగి, తురుముకోవాలి. అలాగే ఒక గిన్నెలో పెరుగును బాగా చిలక్కొట్టాలి.
  2. ఇప్పుడు పెరుగును, దోసకాయ తురుమును రెండూ బాగా కలుపుకోవాలి.
  3. పెరుగు దోసకాయ మిశ్రమంలో ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
  4. ఆపైన వండిన అన్నంలో దోసకాయ పెరుగు మిశ్రమం వేయండి.
  5. ఇప్పుడు ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి, అందులో జీలకర్ర, ఇంగువ, మిరపకాయలు, కరివేపాకు, వేరుశనగ వేసి 1 నిమిషం పాటు వేయించాలి.
  6. చివరగా, వేయించుకున్న పోపును అన్నంలో కలిపేయాలి. పైనుంచి దానిమ్మ గింజలు చల్లుకోవాలి. 10-15 నిమిషాల పాటు ఈ అన్నంను చల్లబరచాలి.

అంతే, దోసకాయ పెరుగు అన్నం రెడీ. ఇందులో ఏం కలుపుకోకుండానే తినేయవచ్చు.