తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mango Chutney Recipes । కారంగా, రుచికరంగా మామిడికాయ చట్నీలు ఇలా చేయండి!

Mango Chutney Recipes । కారంగా, రుచికరంగా మామిడికాయ చట్నీలు ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu

04 August 2024, 1:26 IST

google News
    • Mango Chutney Recipes: మామిడికాయతో చాలా రకాలుగా రుచికరమైన చట్నీలు చేసుకోవచ్చు. పోషకాహార నిపుణులు సూచించిన కొన్ని చట్నీ రెసిపీలను ఇక్కడ చూడండి.
Mango Chutney Recipes
Mango Chutney Recipes (Unsplash)

Mango Chutney Recipes

Mango Chutney Recipes: రుచికరమైన ఆహారపదార్థాలు ప్లేట్‌లో ఉన్నప్పటికీ వేసవిలో ఆహారంపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో ఏదైనా చట్నీ లేదా అవకాయ ఉంటే ఈ ఒక్కదానితోనే ఆహారం రుచి పెరుగుతుంది. ఈ వేసవిలో మనకు మామిడికాయలు పుష్కలంగా లభిస్తాయి. మామిడికాయలతో మనం చాలా రకాల ఊరగాయలు పెట్టుకొని వాటిని ఏడాది పొడవునా నిల్వ ఉంచుకుంటాం. మామిడిపండు కంటే కూడా మామిడికాయ హీట్ స్ట్రోక్ లక్షణాలను తగ్గించడంలో, జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అయితే మామిడికాయను ఇలా ఊరగాయగా మాత్రమే కాకుండా, చట్నీలాగా కూడా చేసుకొని ఏ సమయంలోనైనా భోజనంలో కలుపుకొని తినవచ్చు.

న్యూట్రిషనిస్ట్ హర్‌ప్రీత్ మామిడికాయతో చేయగల చట్నీ రెసిపీలను అందించారు. వీటిని మీరూ ప్రయత్నించి చూడండి.

Mango Peanut Chutney Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు కాల్చిన వేరుశనగ
  • 1/2 కప్పు మామిడికాయ ముక్కలు
  • కారం సరిపడినంత/ 2-3 టీస్పూన్లు
  • 1 టీస్పూన్ జీలకర్ర పొడి
  • అర టీస్పూన్ నూనె
  • 1 టీస్పూన్ నల్ల ఉప్పు
  • 5 వెల్లుల్లి
  • కరివేపాకు రెమ్మ
  • చిన్న అల్లం ముక్క
  • ఉప్పు రుచికి తగినట్లుగా

మామిడికాయ వేరుశనగ చట్నీ తయారీ విధానం

  1. ముందుగా మామిడికాయ తొక్కను తీసి గుజ్జును తీసుకోండి, ఈ గుజ్జును చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
  2. - ఇప్పుడు ఒక బ్లెండర్‌లో అన్ని పదార్థాలను అన్ని పదార్థాలను వేసి బాగా మిక్స్ చేయాలి. గ్రేవీ కోసం కొన్ని నీళ్లు కలుపుకోండి.
  3. అంతే, మ్యాంగో పీనట్ చట్నీ రెడీ.

ఈ చట్నీనీ మీరు ఉదయం ఇడ్లీలోకి, భోజనంలో పరాటాలు, అన్నంలోకి కలుపుకొని తింటూ ఆస్వాదించవచ్చు.

Roasted Mango Chutney Recipe కోసం కావలసినవి

  • 1 మామిడికాయ
  • జీలకర్ర
  • ½ స్పూన్ అల్లం
  • 2-4 పచ్చి మిరపకాయలు
  • 1 కప్పు బెల్లం
  • 1 టీస్పూన్ జీరా
  • ఉప్పు రుచికి తగినంత

కాల్చిన మామిడి చట్నీ తయారీ విధానం

  1. ముందుగా మామిడి, అల్లం, పచ్చిమిర్చిలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు రోస్ట్ చేయాలి.
  2. ఆ తర్వాత మామిడికాయను కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. అల్లం, మిరపకాయలను కూడా కోయండి.
  3. ఇప్పుడు వేయించిన మామిడికాయ, అల్లం, పచ్చి మిరపకాయల ముక్కలతో పాటు బెల్లం, ఉప్పు, జీలకర్రను ఒక బ్లెండర్‌లో వేయండి, 1 కప్పు నీరు కలపండి. మిక్స్ చేయండి.

రోస్టెడ్ మ్యాంగో చట్నీ రెడీ.

Coconut Mango Chutney Recipe కోసం కావలసినవి

  • 1/2 మామిడికాయ
  • 2-3 పచ్చి మిరపకాయలు
  • 1 టీస్పూన్ రోస్టెడ్ జీలకర్ర
  • 6-7 వెల్లుల్లి రెబ్బలు
  • 2 టేబుల్ స్పూన్లు కాల్చిన వేరుశనగ
  • ¼ కప్పు తాజా కొబ్బరి
  • కొత్తిమీర ఆకులు - చిన్న కట్ట
  • ఉప్పు తగినంత

కొబ్బరి మామిడి చట్నీ తయారీ విధానం

  1. ముందుగా మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేయండి, బాగా రుబ్బుకోండి.
  2. వేరుశనగను కాల్చండి. వేయించిన వేరుశనగ, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిని తీసుకుని పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
  3. తాజా కొబ్బరి ముక్కలు, చిన్న బంచ్ కొత్తిమీర కలిపి ముతక పేస్ట్‌గా రుబ్బుకోవాలి.
  4. చివరగా అన్ని పదార్థాలను బ్లెండర్‌లో కలిపి చట్నీలా రుబ్బుకోవాలి.

కొబ్బరి మామిడి చట్నీ రెడీ.

తదుపరి వ్యాసం