Heat Stroke Symptoms । ఈ లక్షణాలుంటే అత్యవసర చికిత్సను అందించాలి!-11 severe signs and symptoms of heat stroke you must not ignore ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heat Stroke Symptoms । ఈ లక్షణాలుంటే అత్యవసర చికిత్సను అందించాలి!

Heat Stroke Symptoms । ఈ లక్షణాలుంటే అత్యవసర చికిత్సను అందించాలి!

HT Telugu Desk HT Telugu
Apr 20, 2023 04:15 PM IST

Heat Stroke Symptoms: వడదెబ్బ తగిలినపుడు అత్యవసరంగా చికిత్సను అందించకపోతే ప్రాణాపాయం కావచ్చు. శరీర ఉష్ణోగ్రతలో విపరీతమైన పెరుగుదల, వేగవంతమైన హృదయ స్పందన , కోమా దాని తీవ్రమైన లక్షణాలు. మరిన్ని లక్షణాలు చూడండి..

Heat Stroke Symptoms
Heat Stroke Symptoms (unsplash)

Summer Health Care: ఈసారి ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలకు పెరిగాయి. వేసవితాపంతో జనం అల్లాడుతున్నారు, విపరీతమైన ఎండవేడి తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది, ముఖ్యంగా వేసవిలో ఎండదెబ్బ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. హీట్‌స్ట్రోక్‌కు తక్షణ వైద్య సహాయం అవసరం. వడదెబ్బ తగిలినపుడు చికిత్స కోసం ఎక్కువసేపు వేచి ఉంటే, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మెదడు, గుండె, మూత్రపిండాలు, కండరాలను వేగంగా దెబ్బతీస్తుంది. చూస్తుండగానే మనిషి ప్రాణం పోవచ్చు. కాబట్టి చికిత్సను అందించేలోపు ఎండదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లబరచడానికి తక్షణ ప్రయత్నాలు చేయండి.

డాక్టర్ రాకేష్ గుప్తా, డాక్టర్ పవన్ పాయ్ హీట్ స్ట్రోక్ సంకేతాలు, లక్షణాలను పంచుకున్నారు. ఆ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పారు.

Heat Stroke Symptoms- వడదెబ్బ లక్షణాలు

డాక్టర్లు తెలిపిన వడదెబ్బ తీవ్రమైన లక్షణాలు ఈ కింద చూడండి.

1. అధిక శరీర ఉష్ణోగ్రత: శరీర ఉష్ణోగ్రత 104°F (40°C) లేదా అంతకంటే ఎక్కువ ఉండటం అనేది హీట్ స్ట్రోక్‌కి సాధారణ సంకేతం. ఇలా ఉంటే వెంటనే వైద్య సదుపాయాన్ని పొందాలి.

2. వేగవంతమైన హృదయ స్పందన: అధిక శరీర ఉష్ణోగ్రతకు ప్రతిస్పందనగా గుండె వేగంగా కొట్టుకోవచ్చు.

3. వేగవంతమైన శ్వాస: వేగంగా శ్వాస తీసుకోవడం ద్వారా శరీరం తనను తాను చల్లబరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మీ శరీరం వేడెక్కుతున్నప్పుడు, మీ గుండె విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా హైపర్‌వెంటిలేషన్‌కు దారితీయవచ్చు.

4. గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి: హీట్ స్ట్రోక్ అనేది మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది, దీనివల్ల గందరగోళం, దిక్కుతోచని స్థితి ఉంటుంది. కొన్నిసార్లు మూర్ఛలు కూడా వస్తాయి. ఎక్సర్షనల్ హీట్ స్ట్రోక్ మీ కేంద్ర నాడీ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది, కాబట్టి సమన్వయ లోపం, దిక్కుతోచని స్థితి, కోపం లేదా నడవలేకపోవడం ప్రధాన హెచ్చరిక సంకేతాలు.

5. తలనొప్పి: తీవ్రమైన తలనొప్పి, తరచుగా తల తిరగడం లేదా మైకం వంటివి హీట్ స్ట్రోక్ లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా డీహైడ్రేషన్ లేదా కేంద్ర నాడీ వ్యవస్థపై హీట్ స్ట్రోక్ ప్రభావం వల్ల తలెత్తుతాయి.

6. వికారం, వాంతులు: అధిక శరీర ఉష్ణోగ్రతకు శరీరం సహజ ప్రతిస్పందనలో భాగంగా వికారం, వాంతులు ఉంటాయి.

7. పొడి, వేడి చర్మం: చర్మం పొడిగా, వేడిగా, ఎర్రబడినట్లు అనిపించవచ్చు. అధిక శరీర ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ చెమటలు పట్టకపోవచ్చు.

8. కండరాల తిమ్మిరి లేదా బలహీనత: హీట్ స్ట్రోక్ కండరాల తిమ్మిరి, బలహీనత లేదా స్పృహ కోల్పోయేలా చేస్తుంది. తీవ్రంగా వ్యాయామం చేసిన తర్వాత కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. మీరు విపరీతమైన వేడిలో చెమటలు పట్టేలా శ్రమించినప్పుడు, మీ కాళ్లు, చేతులు లేదా పొత్తికడుపులో తీవ్రమైన సంకోచాలు ఉండవచ్చు.

9. చెమట లేకపోవడం లేదా అధిక చెమట: మీరు ఎక్కువ కాలం పాటు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నప్పుడు, మీ శరీరం దాని అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడంలో విఫలమవుతుంది. అందువల్ల, మీకు చెమటలు పట్టకపోవచ్చు. మరోవైపు ఎక్సర్‌షనల్ హీట్ స్ట్రోక్ కు గురైతే, అప్పుడు ఆ వ్యక్తికి విపరీతంగా చెమటలు పడతాయి.

10. తలతిరగడం: అధికంగా చెమటలు పట్టడం వల్ల శరీరం క్రమంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది అనేక అవయవాలపై ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది, ఇతర హీట్ స్ట్రోక్ లక్షణాలను పెంచుతుంది. మైకము, మూర్ఛ, వికారం లేదా వాంతికి దారితీస్తుంది.

11. స్కిన్ దద్దుర్లు: హీట్ స్ట్రోక్‌కు గురైనపుడు శరీరం తననితాను చల్లబరచుకోవడానికి చర్మం వైపు రక్త ప్రవాహాన్ని పంపుతుంది, దీని వలన చర్మం ఎర్రగా కనిపిస్తుంది.

ఈ లక్షణాలు ఉంటే తక్షణమే వ్యక్తిని చల్లబరిచి ప్రయత్నం చేస్తూ చికిత్సను అందించాలి, అప్పుడు ప్రాణాపాయం తప్పుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్