Mango Poha Recipe । ఆహా అనిపించేలా మామిడికాయ పోహాను ఇలా చేయండి!
Mango Poha Recipe: ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటే పోహా ఆహా అనేలా ఉంటుంది. ఈ వేసవిలో సరికొత్తగా మామిడికాయ పోహా చేసుకోండి, రెసిపీ ఇక్కడ ఉంది.
Mango Poha Recipe (slurrp)
Breakfast Recipes: ఆరోగ్యకరమైన అల్పాహారాల జాబితాలో కచ్చితంగా ఉండే అల్పాహారం అటుకులు. దీనినే పోహా అని కూడా అంటారు. లావు అటుకులతో మెత్తగా చేసే పోహా రుచిలో ఆహా అనేలా ఉంటుంది. దీనిని టొమాటోలు, నిమ్మరసం కలిపి వివిధ ఫ్లేవర్లలో తయారు చేస్తారు. ఇది మామిడిపండ్ల సీజన్ కాబట్టి మీరు మ్యాంగో పోహాను ప్రయత్నించవచ్చు.
మన ఇళ్లల్లో పచ్చి మామిడికాయతో వివిధ వంటకాలను చేయడం తెలిసిందే. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, మామిడికాయ కూర ఈ వేసవిలో ఎక్కువగా చేసుకుంటారు. ఒకసారి మామిడికాయ పోహా కూడా ట్రై చేసి చూడండి. మ్యాంగో పోహా రెసిపీ కోసం కింద చూడండి.
Mango Poha Recipe కోసం కావలసినవి
- 2 కప్పులు అటుకులు (మందమైనవి)
- 1 కప్పు మామిడికాయ తురుము
- 2 టేబుల్ స్పూన్లు పచ్చికొబ్బరి తురుము
- 3 టేబుల్ స్పూన్లు నూనె
- 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ
- 1 టీస్పూన్ అల్లం తురుము
- 1 టీస్పూన్ మినపపప్పు
- 1 టీస్పూన్ శనగపప్పు
- 1/2 టీస్పూన్ ఆవాలు
- 1/4 టీస్పూన్ పసుపు
- 1/8 టీస్పూన్ ఇంగువ పొడి
- 4 పచ్చిమిరపకాయలు
- 1 కరివేపాకు రెమ్మ
- కొత్తిమీర గార్నిషింగ్ కోసం
- 3/4 టీస్పూన్ ఉప్పు లేదా రుచికి తగినంత
మామిడికాయ పోహా తయారీ విధానం
- ముందుగా అటుకులను నీటిలో కడిగి, ఆపైన ఆ నీటిని వడకట్టి కాసేపు పక్కనపెట్టండి.
- ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి, అది వేడయ్యాక ఆవాలు చిటపడలాడనివ్వండి, ఆపైన కరివేపాకు, పప్పులు వేసి వేయించండి.
- అనంతరం పచ్చిమిరపకాయలు, ఇంగువ, పసుపు కూడా వేసి కలపండి.
- ఆపైన తురిమిన మామిడికాయను వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- ఇప్పుడు మంటను తగ్గించి నానబెట్టి, ఆరబెట్టిన అటుకులు, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా బాగా కలపాలి.
- చివరగా తురిమిన కొబ్బరి , కొత్తిమీర ఆకులు వేసి మూతపెట్టి స్టవ్ ఆఫ్ చేయండి.
అంతే, రుచికరమైన మ్యాంగో పోహా రెడీ.
సంబంధిత కథనం