International Carrot Day : క్యారెట్‌లతో ఇలా రెసిపీలు ట్రై చేయండి
International Carrot Day 2023 : ఏప్రిల్ 4న ప్రపంచ క్యారెట్ దినోత్సవం. క్యారెట్‌లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే కొంతమంది క్యారెట్ తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు.. వివిధ రకాలుగా క్యారెట్ రెసిపీ తయారుచేసుకుని తీసుకోవచ్చు.
పండ్లు, కూరగాయలు తినడానికి పిల్లలు ఇష్టపడకపోవటం సర్వసాధారణం. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ప్రతి తల్లిదండ్రులకు పెద్ద కష్టం. జంక్ ఫుడ్ అంటేనే పిల్లలు ఇష్టపడతారు. ఏప్రిల్ 4 ప్రపంచ క్యారెట్ దినోత్సవం నాడు మీ పిల్లలు ఇష్టపడే క్యారెట్ స్పెషల్ రెసిపీలను తయారు చేయండి. రుచితో పాటు, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది. క్యారెట్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు ఉన్నాయి.
1. క్యారెట్ సలాడ్ రెసిపీ
కావలసిన పదార్థాలు:
2 ఆపిల్స్ చిన్న ముక్కలుగా తరిగినవి, 3 కప్పులు తురిమిన క్యారెట్లు, తరిగిన పైనాపిల్ 200 గ్రాములు, ఎండుద్రాక్ష 3 టేబుల్ స్పూన్లు, వనిల్లా ఎసెన్స్‌తో 1/4 కప్పు పెరుగు, 1/4 కప్పు సాదా పెరుగు, 1 టీస్పూన్ నిమ్మరసం, కాటేజ్ చీజ్, ఉప్పు (రుచికి)
క్యారెట్, యాపిల్, ఎండుద్రాక్ష, పైనాపిల్ ముక్కలను పెద్ద గిన్నెలో వేసి, పైనాపిల్ రసం వేసి కలపాలి. ఒక గిన్నెలో నిమ్మరసం, కాటేజ్ చీజ్, పెరుగు, ఉప్పు కలపండి. అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. ఇప్పుడు క్యారెట్ సలాడ్ సిద్ధంగా ఉంది.
2. క్యారెట్ సూప్
కావలసిన పదార్థాలు:
10 గ్రాముల వెన్న, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, 1 తరిగిన ఉల్లిపాయ మరియు 2 వెల్లుల్లి లవంగాలు, 2 కప్పులు తురిమిన క్యారెట్లు, రుచికి ఉప్పు మరియు మిరియాలు, 2 కప్పుల నీరు.
బాణలిలో నూనె, వెన్న వేయాలి. వెన్న కరిగిన తర్వాత, ఉల్లిపాయ, గరంమసాలా వేసి ఉడికించాలి. తరువాత వెల్లుల్లి వేసి కాసేపు వేయించుకోవాలి. నీరు, ఉప్పు, మిరియాలతో పాటు తురిమిన క్యారెట్ జోడించండి. క్యారెట్లను కాసేపు ఉడికించాలి. అవి మెత్తబడే వరకు అలాగే ఉంచాలి. ఇది మృదువైనంత వరకు కలపాలి. ఇప్పుడు క్యారెట్ సూప్ సిద్ధంగా ఉంది.
3. క్యారెట్ స్మూతీ
కావలసిన పదార్థాలు :
1 కప్పు తురిమిన క్యారెట్, 1 కప్పు తరిగిన అరటి, 1 కప్పు పాలు, వాల్నట్ 1 టేబుల్ స్పూన్, 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి
క్యారెట్, అరటిపండ్లు, ఇతర పదార్థాలతో స్మూతీని తయారు చేయడానికి పాలు, వాల్‌నట్‌లు, దాల్చినచెక్క, జాజికాయలను మిక్సీ పట్టుకోవాలి. అందులో కొద్దిగా చక్కెరతో కలపండి. తర్వాత ఫ్రిజ్‌లో ఉంచండి లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. ఇప్పుడు క్యారెట్ స్మూతీ రెడీ అయింది.
సంబంధిత కథనం