తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Radish Curd Chutney Recipe । ముల్లంగి పెరుగు పచ్చడి.. బిర్యానీతో తింటే అదిరిపోతుంది!

Radish Curd Chutney Recipe । ముల్లంగి పెరుగు పచ్చడి.. బిర్యానీతో తింటే అదిరిపోతుంది!

HT Telugu Desk HT Telugu

24 January 2023, 14:19 IST

    • Radish Curd Chutney Recipe: ముల్లంగితో ఎప్పుడైనా పెరుగు పచ్చడి చేసుకున్నారా? పులావు, బిర్యానీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Radish Curd Chutney Recipe
Radish Curd Chutney Recipe (Slurrp)

Radish Curd Chutney Recipe

ముల్లంగి మనకు ఈ కాలంలో విరివిగా లభిస్తుంది. ఇది కొంచెం క్రంచీగా, కొద్దిగా కారంగా ఉండే దుంప కూరగాయ. దీనిని ఏ వంటకంలో అయినా రుచికోసం వేయవచ్చు లేదా దీనినే వివిధ రకాలుగా వండుకోవచ్చు. దీనిని కూరగా వండుకోవచ్చు, సాంబారులో ఉడికించవచ్చు. ముల్లంగి ఊరగాయ చేసుకున్నా రుచిగానే ఉంటుంది. అంతేకాదు పెరుగుతో కలిపి రైతా, పెరుగు పచ్చడి చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Tired After Sleeping : రాత్రి బాగా నిద్రపోయినా.. ఉదయం అలసిపోవడానికి కారణాలు

Foxtail Millet Benefits : మీకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కొర్రలు చాలు

Egg potato Fry: పిల్లలకు నచ్చేలా కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీ, చిటికెలో వండేయచ్చు

Mango eating: ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లను తినాల్సిన పద్ధతి ఇది, ఇలా అయితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది

ముల్లంగితో చేసుకునే పెరుగు పచ్చడి అన్నంతో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. బిర్యానీతో గానీ, పులావులో గానీ కలుపుకొని తింటే దాని రుచే వేరు.మరి ముల్లంగి పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలి, కావలసిన పదార్థాలేమిటో ఇక్కడ తెలుసుకోండి, ముల్లంగి పెరుగు పచ్చడి రెసిపీ ఈ కింద ఉంది చూడండి.

Radish Curd Chutney Recipe కోసం కావలసినవి

  • ముల్లంగి - సుమారు 1 కప్పు
  • పెరుగు - 2 కప్పులు (విస్కడ్)
  • నూనె - 1 స్పూన్
  • జీలకర్ర - ½ tsp
  • మిరియాల పొడి - ½ tsp
  • వేయించిన జీలకర్ర పొడి - ½ tsp
  • ఉప్పు - రుచికి తగినంత
  • కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు

Mullangi Perugu Pachadi - ముల్లంగి పెరుగు పచ్చడి తయారీ విధానం

1. ముందుగా ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి, అందులో జీలకర్ర వేసి వేయించండి. ఇప్పుడు సన్నగా తరిగిన ముల్లంగిని వేసి, మీడియం మంటలో సుమారు 5-7 నిమిషాల పాటు వేగించండి, పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి.

2. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత కాస్త కారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక నిమిషం పాటు వేయించి, కొంచెం చల్లబరచండి.

3. ఇప్పుడు పెరుగును చిలికి మజ్జిగ చేసి సిద్ధంగా ఉంచండి. ఈ మజ్జిగలో ఉడికించిన ముల్లంగిని వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలపాలి.

అంతే, ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ. బిరియానీ లేదా పులావ్‌తో కలిపి వడ్డించండి, ఆహా ఓహో అంటూ ఆరగించండి. ఈ పెరుగు పచ్చడిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం