తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lunch Recipe: రెస్టరెంట్ స్టైల్ గోంగూర చికెన్ బిర్యానీ ఇంట్లోనే..

lunch recipe: రెస్టరెంట్ స్టైల్ గోంగూర చికెన్ బిర్యానీ ఇంట్లోనే..

HT Telugu Desk HT Telugu

26 April 2023, 12:59 IST

  • గోంగూర, చికెన్ ఈ రెండూ నోరూరించేవే. అవి రెండూ కలిపి బిర్యానీ చేస్తే ఇంకా రుచి. అదెలా చేయాలో చూసేయండి. 

గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ
గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ

గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ

పేరు వినగానే నోరూరే రుచి గోంగూర చికెన్ బిర్యానీది. రెస్టరెంట్లో వచ్చే రుచి ఇంట్లో చేస్తే రాదు అనిపిస్తుంది. కానీ కొన్ని పక్కా కొలతలతో చేస్తే ఇంట్లో కూడా బిర్యానీ అదిరిపోయేలా చేసుకోవచ్చు. దాని తయారు చేసే విధానాన్ని మరింత వివరంగా, రుచి ఇంకాస్త పెరిగేలా కొన్నిచిట్కాలతో చెబుతున్నారు ప్లాట్ ఫామ్ 65 చెఫ్ వీహెచ్ సురేశ్.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Tips In Telugu : ఈ 6 గుణాలపై మీకు నియంత్రణ లేకుంటే జీవితంలో ఓడిపోతారు

Jeera Rice : ఉదయం అల్పాహారంగా జీలకర్ర రైస్ ఇలా చేసుకోండి.. 10 నిమిషాల్లో రెడీ..

Tuesday Motivation : అందాన్ని చూసి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకు.. అంతమించిన విషయాలు చాలా ఉంటాయి

Talking In Sleep : నిద్రలో మాట్లాడే సమస్య ఉంటే బయటపడేందుకు సింపుల్ చిట్కాలు

కావాల్సిన పదార్ధాలు:

నెయ్యి/ నూనె - 300 గ్రాములు

ఉల్లిపాయలు - 350 గ్రాములు

చికెన్ (బోన్) - 400 గ్రాములు

బాస్మతీ బియ్యం - 400 గ్రాములు

గరం మసాలా - 1 టీ స్పూన్

పసుపు - 1 టీ స్పూన్

అల్లం, వెల్లుల్లి పేస్ట్- 2 టీ స్పూన్లు

నీరు- 800 మిల్లీ లీటర్లు

నల్ల జీలకర్ర- 1 టీస్పూన్

బిర్యానీ ఆకులు- 2

బాదం పప్పు- 200 గ్రాములు

పెరుగు - 600 గ్రాములు

నిమ్మరసం- 1 టీస్పూన్

గోంగూర కట్ట- 1

రోజ్ వాటర్ - 2 టీ స్పూన్లు

పచ్చి మిర్చి - 8 ముక్కలు

పచ్చి మిర్చి పేస్ట్- 2 టీస్పూన్లు

తయారీ విధానం:

step 1: ఒక బౌల్ లోకి తగినన్ని నీటిని తీసుకుని దానిలో ముందుగా బాస్మతి బియ్యాన్ని నాన పెట్టాలి.

step 2 : చికెన్ ను మరో బౌల్ లోకి తీసుకుని నీటితో కడగాలి. పూర్తిగా నీరు అంతా పోయేలా చూడాలి. తర్వాత చికెన్ లో పెరుగు, పసుపు, ఉప్పు సరిపడినంత వేసి బాగా కలిపి మారినేట్ చేయాలి.

step 3: కట్టగా ఉన్న గోంగూరను తీసుకుని వాటి కాడలు తీసేయాలి. శభ్రంగా కడిగి ఆరపెట్టాలి.

step 4: బిర్యాని హండీ ని తీసుకుని అందులో నూనె, పసుపు, పచ్చి మిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, అల్లం వెల్లులి పేస్ట్, నల్ల జీలకర్ర వేసేయాలి. అవన్నీ వేగాక ఇందులోనే గోంగూర వేసి బాగా కలపాలి.అందులో రెండు టీ స్పూన్ల పచ్చి మిర్చి పేస్టును వేయాలి.

step 5: ఇప్పుడు మారినేట్ చేసుకున్న చికెన్ వేసి పదార్థాలన్నీ అంటుకునేలా బాగా కలియపెట్టాలి. అందులో 800 మిల్లీ లీటర్లు నీటిని పోయాలి. నీటిని బాగా మరగనిచ్చిన తరువాత అందులో రోజ్ వాటర్, బాస్మతీ బియ్యం వేయాలి.

step 6: కాసేపయ్యాక మూతపెట్టేయండి. ఉడికిందా లేదా అనే తెలుసుకునేందుకు మధ్య మధ్యలో మూత తీసి చూడాలి. ఉడికాక దాని పైన కొత్తిమీరను వేసుకోవాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాల తరువాత వేడి వేడి గోంగూర చికెన్ బిర్యాని రెడీ.

టాపిక్

తదుపరి వ్యాసం