తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: నువ్వో అనకొండ..విజయ్‌ దేవరకొండపై మండిపడిన ముంబై థియేటర్‌ ఓనర్

Vijay Deverakonda: నువ్వో అనకొండ..విజయ్‌ దేవరకొండపై మండిపడిన ముంబై థియేటర్‌ ఓనర్

HT Telugu Desk HT Telugu

26 August 2022, 15:17 IST

    • Vijay Deverakonda: నువ్వో అనకొండ అంటూ విజయ్‌ దేవరకొండపై తీవ్రంగా మండిపడ్డాడు ఓ ముంబై థియేటర్‌ ఓనర్‌. ఆమిర్‌ ఖాన్‌ను చూసైనా నేర్చుకోవాల్సింది అని ఆ వ్యక్తి అనడం విశేషం. ఇంతకీ ఏం జరిగింది?
విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (PTI)

విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే నటించిన లైగర్‌ మూవీ గురువారం (ఆగస్ట్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలకు చాలా దూరంలోనే నిలిచిపోయింది. తొలి షో నుంచే నెగటివ్‌ టాక్‌ బాగా వచ్చింది. ఇది ఆ మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లు వసూలు చేసినా.. క్రమంగా వసూళ్లు తగ్గే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

దీనికితోడు మూవీ రిలీజ్‌కు ముందు విజయ్‌ చేసిన కామెంట్స్‌ కూడా బుకింగ్స్‌పై ప్రభావం చూపాయని అంటున్నాడు ముంబైకి చెందిన ఓ థియేటర్‌ ఓనర్‌. ఆయన పేరు మనోజ్‌ దేశాయ్‌. ఈయన ముంబైలోని ప్రముఖ గైటీ గెలాక్సీ, మరాఠా మందిర్‌ సినిమా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌. విజయ్‌ చాలా అహంకారంగా మాట్లాడాడని మనోజ్‌ మండిపడుతున్నారు. ఆమిర్‌ ఖాన్‌ను చూసైనా నేర్చుకోవాల్సిందని సూచించాడు.

బాలీవుడ్‌లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్‌ మాట్లాడాడు. "మా సినిమాను బాయ్‌కాట్‌ చేయండి అంటూ ఎందుకంత స్మార్ట్‌నెస్‌ చూపిస్తున్నావ్‌. ఇలా అయితే ఓటీటీలో కూడా చూడరు. నీ ప్రవర్తన వల్ల మా బిజినెస్‌ దెబ్బతిన్నది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై ప్రభావం చూపింది. మిస్టర్‌ విజయ్‌ నువ్వో అనకొండ. నువ్వో అనకొండలాగా మాట్లాడుతున్నావ్‌. వినాశ కాలే విపరీత బుద్ధి. వినాశనం జరిగే సమయంలో బుర్ర పనిచేయదు. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావ్‌. ఇక నీ ఇష్టం" అని మనోజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

విజయ్‌ కనీసం ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, తాప్సీ పన్నులను చూసైనా నేర్చుకోవాల్సింది అని కూడా మనోజ్‌ అన్నాడు. "మిస్టర్‌ విజయ్‌ నువ్వు అహంకారిగా మారినట్లున్నావు. మీ ఇష్టం ఉంటే సినిమా చూడండి లేదంటే లేదు అనే కామెంట్స్‌ ప్రభావం నువ్వు చూడలేదా. ఆడియెన్స్‌ చూడకపోతే ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, తాప్సీల పరిస్థితి చూడు. లైగర్‌పై నాకు చాలా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇలాంటి కామెంట్స్‌ ప్రభావం చూపుతాయి. ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు" అని మనోజ్‌ అన్నాడు.

లైగర్‌ ప్రమోషన్లలో భాగంగా విజయ్‌ దేవరకొండ ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై మాట్లాడిన విషయం తెలిసిందే. "ఎవరు ఆపుతారో చూద్దాం. భయపడాల్సింది ఏమీ లేదు. ఏమీ లేనప్పుడే నేను భయపడలేదు. ఇప్పుడు ఎంతో కొంత సాధించిన తర్వాత కూడా భయపడాల్సిన పని లేదు. నాకు మా అమ్మ ఆశీర్వాదం ఉంది. ప్రజల ప్రేమ, దేవుడు సపోర్ట్‌ ఉంది. మమ్మల్ని ఎవరు ఆపుతారో చూద్దాం" అని విజయ్ అన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.