Vijay Deverakonda: బాయ్‌కాట్ ఆమీర్‌ను ప్రభావితం చేయదు.. వారికే నష్టం: విజయ్-vijay deverakonda says boycott trends don t just affect aamir khan but others too ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: బాయ్‌కాట్ ఆమీర్‌ను ప్రభావితం చేయదు.. వారికే నష్టం: విజయ్

Vijay Deverakonda: బాయ్‌కాట్ ఆమీర్‌ను ప్రభావితం చేయదు.. వారికే నష్టం: విజయ్

Maragani Govardhan HT Telugu
Aug 19, 2022 06:17 PM IST

బాలీవుడ్‌లో బాయ్ కాట్ ట్రెండ్ గత కొంతకాలం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమీర్ నటించిన లాల్ సింగ్ చడ్ఢా చిత్రంపై కూడా ఈ ట్రెండ్ నడిచింది. తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

లాల్ సింగ్ చడ్ఢాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
లాల్ సింగ్ చడ్ఢాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు (HT)

దక్షిణాది సినిమాల ఆధిపత్యం బాలీవుడ్‌లో కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన కార్తికేయ 2 చిత్రంలో మరోసారి ఉత్తరాది ప్రేక్షకులు దక్షిణాది సినిమాలపై ప్రేమ కురిపిస్తున్నారు. ఈ సినిమా విడుదలైనప్పుడే బాలీవుడ్ స్టార్ హీరోలైన ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాల్ సింగ్ చడ్ఢా వచ్చినప్పటికీ ఆ చిత్రాలను ఆదరించలేదు. మరి ముఖ్యంగా ఆమీర్ లాల్ సింగ్ చడ్ఢా సినిమా గురించైతే విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottBollywood, #BoycottLaalSinghChaddha అనే హ్యాష్‌ ట్యాగులను ట్రెండ్ చేశారు. ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై తాజాగా మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఆమీర్ ఖాన్‌ను ఏం ప్రభావితం చేయలేదని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బాలీవుడ్ హీరోకు మద్దతుగా మాట్లాడాడు.

బాలీవుడ్‌లో బాయ్‌కాట్ ట్రెండ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఈ విధంగా బదులిచ్చాడు విజయ్. "నేను సినిమా సెట్‌లో ఉన్నప్పుడు చాలా సార్లు ఆలోచించాను. హీరో, హీరోయిన్, దర్శకుడు కాకుండా చాలా ముఖ్యమైన పాత్రలు సినిమాల్లో ఉంటాయి. ఓ సినిమా కోసం 200 నుంచి 300 మంది నటులు పనిచేస్తుంటారు. వీరికి సహకరించే సిబ్బంది కూడా చిత్రంపైనే ఆధారపడి ఉంటారు. కాబట్టి ఒక్క సినిమా ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది. ఆమీర్ ఖాన్ సర్ లాల్ సింగ్ చడ్ఢా చిత్రంలో ఆయన పేరు మాత్రమే వినిపించినప్పటికీ.. ఆ పేరుతో 2000 నుంచి 3000 కుటుంబాలకు ఉపాధి అందుతుంది. మీరు సినిమా బహిష్కరించాలని నిర్ణయించుకుంటే అది ఆమీర్‌ను ఏ మాత్రం ప్రభావితం చేయదు.. కానీ వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. అని విజయ్ దేవరకొండ బాయ్‌కాట్ ట్రెండ్‌పై మాట్లాడాడు.

"జనాలను థియేటర్లకు రప్పించాలనుకుంటున్న ఆమీర్ ఖాన్ సర్‌కే ఇలా ఎందుకు జరుగుతుందో నాకు కచ్చితంగా తెలియదు. మీరు చేసే బాయ్‌కాట్ వల్ల ఆమీర్ ఖాన్‌పై మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని గ్రహించండి." అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

లాల్ సింగ్ చడ్ఢా చిత్రం హాలీవుడ్‌లో తెరకెక్కిన ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. మాతృకలో టామ్ హ్యాంక్స్ నటించగా.. రీమేక్‌లో ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలైంది. తొలి రోజు రూ.11 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. మొదటి వారాంతానికి రూ.49 కోట్లను మాత్రమే రాబట్టింది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తెలుగులో మంచి పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తోన్న ఈ హీరో తన పాపులారిటీని ఇంకాస్త పెంచుకున్నాడు. బాలీవుడ్‌లోనూ విజయ్ తన క్రేజ్‌ను ఇలాగే కొనసాగించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన లైగర్ చిత్రం ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం