Vijay Deverakonda: లైగర్‌ ఫ్లాప్‌ అయితే ఏం చేస్తావ్.. ఇదీ విజయ్‌ దేవరకొండ రియాక్షన్‌-vijay deverakonda reacted to what if liger movie flops ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: లైగర్‌ ఫ్లాప్‌ అయితే ఏం చేస్తావ్.. ఇదీ విజయ్‌ దేవరకొండ రియాక్షన్‌

Vijay Deverakonda: లైగర్‌ ఫ్లాప్‌ అయితే ఏం చేస్తావ్.. ఇదీ విజయ్‌ దేవరకొండ రియాక్షన్‌

HT Telugu Desk HT Telugu
Aug 23, 2022 01:30 PM IST

Vijay Deverakonda: లైగర్‌ ఫ్లాప్‌ అయితే ఏం చేస్తావ్‌ అని విజయ్‌ దేవరకొండను అడిగినప్పుడు అతను ఇచ్చిన ఆన్సర్‌ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒక విధంగా అతన్ని మెచ్చుకున్నారు.

ఢిల్లీలో లైగర్ మూవీ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే
ఢిల్లీలో లైగర్ మూవీ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే (PTI)

Vijay Deverakonda: లైగర్‌ మూవీ రిలీజ్‌కు మరో రెండు రోజుల సమయమే ఉంది. ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే థియేటర్లకు జనాలు రావడమే కరువైన ఈ కాలంలో బాలీవుడ్‌లో వరుసగా అన్ని సినిమాలు ఫ్లాపవుతున్నాయి. బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా బోల్తా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో లైగర్‌కు హిందీ బెల్ట్‌లో పెద్ద సవాలే ఎదురు కానుంది.

మరి లైగర్‌ మూవీ కూడా ఫ్లాపయితే ఎలా? ఇదే ప్రశ్నను ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండను అడిగితే.. అతడు చాలా పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యాడు. ఒకవేళ లైగర్‌ ఫ్లాపయినా కూడా తానేమీ కోపంగా రియాక్ట్‌ కానని అతడు చెప్పాడు. నిజానికి విజయ్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతని చివరి మూవీ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ కూడా దారుణంగా ఫ్లాపయింది.

"ఇదే ప్రశ్న మీరు కొన్నేళ్ల కిందట నన్ను అడిగి ఉంటే నేను కోపంతో రిప్లై ఇచ్చే వాడిని. నాకు చాలా కోపం వచ్చేది. కానీ గత కొన్ని రోజులుగా మాకు లభిస్తున్న ప్రేమను చూసిన తర్వాత ఇలాంటి చిన్న విషయాలకు నేను కోపంగా రియాక్టవడం కరెక్ట్‌ కాదు. నేను ఈ ప్రేమనే గుర్తుంచుకోవాలని అనుకుంటున్నా. ఆడియెన్సే ముఖ్యం. మేము వాళ్ల కోసమే పని చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్లను కలవడానికే దేశమంతా తిరుగుతున్నాం" అని విజయ్‌ అనడం విశేషం.

లైగర్‌ మూవీలో మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్‌ బాక్సర్‌గా విజయ్‌ కనిపించనున్నాడు. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటి అనన్య పాండే నటించింది. ఈ సినిమాను తెలుగు, హిందీల్లో ఒకేసారి షూట్‌ చేయగా.. మిగతా భాషల్లోకి డబ్‌ చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం