Bollywood: బాలీవుడ్‌, రాహుల్‌గాంధీ పరిస్థితి ఒకేలా ఉంది: స్వర భాస్కర్‌-bollywood actress swara bhaskar compares industry situation to rahul gandhi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bollywood Actress Swara Bhaskar Compares Industry Situation To Rahul Gandhi

Bollywood: బాలీవుడ్‌, రాహుల్‌గాంధీ పరిస్థితి ఒకేలా ఉంది: స్వర భాస్కర్‌

HT Telugu Desk HT Telugu
Aug 23, 2022 07:10 AM IST

Bollywood: బాలీవుడ్‌, రాహుల్ గాంధీ పరిస్థితి ఒకేలా ఉందని అంటోంది నటి స్వర భాస్కర్‌. ప్రస్తుతం దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ ఇండస్ట్రీని ఆమె కాంగ్రెస్‌ నేత రాహుల్‌తో పోల్చడం విశేషం.

బాలీవుడ్ నటి స్వర భాస్కర్, రాహుల్ గాంధీ
బాలీవుడ్ నటి స్వర భాస్కర్, రాహుల్ గాంధీ

Bollywood: ఇది చదవగానే బాలీవుడ్‌ ఏంటి? రాహుల్‌గాంధీ ఏంటి అన్న అనుమానం మీకు రావచ్చు. కానీ ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను అక్కడి నటి స్వర భాస్కర్‌.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌తో పోల్చింది మరి. ఇండియా టుడేతో మాట్లాడిన ఆమె.. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌ పరిస్థితి ఇలా అయిపోయిందని అభిప్రాయపడింది.

దీని వెనుక ఉన్న కారణాలను ఆమె చెప్పుకొచ్చింది. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం కూడా ఈ దుస్థితికి ప్రధాన కారణమని ఆమె చెప్పడం విశేషం. థియేటర్లలో షోలు రద్దవడానికి బాలీవుడ్‌ కారణం కాదని స్వర భాస్కర్‌ అంటోంది. ఇందులో ఓటీటీల పాత్ర కూడా ఉన్నదని చెప్పింది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌పై ద్వేషం పెరిగిపోయిందని, అది ఇంకా కొనసాగుతోందని స్వర అభిప్రాయపడింది.

బాలీవుడ్‌కు, రాహుల్‌గాంధీకి లింకు

ఇక బాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితిని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతోనూ ఆమె పోల్చింది. "ఇది చాలా వింత పోలికగా మీకు అనిపించవచ్చు. కానీ నాకు రాహుల్‌ గాంధీ గుర్తొస్తున్నారు. ఆయనను అందరూ పప్పూ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడందరూ అదే నమ్ముతున్నారు. నేను ఆయనను కలిశాను. ఆయన చాలా ఇంటెలిజెంట్‌. తన భావాలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు. బాలీవుడ్‌తోనూ ఈ పప్పుఫికేషన్‌ జరిగింది" అని స్వర అనడం విశేషం.

బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమిర్ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా, అక్షయ్‌ కుమార్‌ రక్షా బంధన్‌, తాప్సీ పన్ను దొబారాలాంటి మూవీస్‌ దారుణంగా ఫ్లాపయ్యాయి. అయితే బాయ్‌కాట్‌ ట్రెండ్‌ కూడా బాలీవుడ్‌ కొంప ముంచుతోందని స్వర భాస్కర్‌ అభిప్రాయపడింది. ఇప్పుడు రానున్న లైగర్‌, పఠాన్‌ సినిమాలు కూడా ఈ బాయ్‌కాట్‌ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

IPL_Entry_Point