Congress President Election: రాహుల్ విముఖతతో సవాలుగా మారిన అధ్యక్ష ఎన్నిక-election for new president becomes challenge for congress ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congress President Election: రాహుల్ విముఖతతో సవాలుగా మారిన అధ్యక్ష ఎన్నిక

Congress President Election: రాహుల్ విముఖతతో సవాలుగా మారిన అధ్యక్ష ఎన్నిక

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 10:14 AM IST

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టందుకు రాహుల్ గాంధీ అయిష్టంగా ఉండడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ సవాలుగా మారింది.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరించనుంది?
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరించనుంది? (PTI)

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేయడంతో ఇప్పుడు అధ్యక్ష పదవికి జరిగే ఎన్నిక కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది.

ఆగస్టు 20 వరకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది. అయితే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, రాహుల్ గాంధీ ఇప్పటి వరకు తన వైఖరిని స్పష్టం చేయలేదు.

ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల అథారిటీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం అథారిటీ ఛైర్మన్ వేచి చూస్తున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీలను నిర్ధారిస్తే.. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల అథారిటీ అదే విషయాన్ని తెలియజేస్తుంది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ సుముఖంగా లేనందున ఈ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

నిజానికి గాంధీయేతరుడికి అధ్యక్ష పదవిని ఇవ్వాలనే పట్టుదలతో రాహుల్ ఉన్నారని, అందుకే సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో ఆరోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ ఆ పదవిని చేపట్టకూడదని, సోనియా స్థానంలో గాంధీయేతర వ్యక్తి ఆ పదవిని చేపట్టాలని రాహుల్ కోరుతున్నారు.

రాహుల్‌ను ఒప్పించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ప్రియాంకను రెండో ఎంపికగా పరిగణించింది. లేని పక్షంలో పార్టీ ఐక్యత కోసం 2024 వరకు ఉండాల్సిందిగా సోనియా గాంధీని కోరనున్నట్టు సమాచారం.

చివరకు అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, కుమారి శైలజ, ముకుల్ వాస్నిక్ వంటి నేతల పేర్లలో ఒకరి పేర్లను అంగీకరించే ప్రయత్నం కూడా జరగొచ్చు.

సాంకేతికంగా ఆదివారం నుంచే ప్రారంభమైన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని చూస్తే గాంధీ కుటుంబానికి రాబోయే కొద్ది రోజులు చాలా ముఖ్యమైనవి.

 పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి 'భారత్ జోడో యాత్ర' చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. 148 రోజుల పాదయాత్ర కాశ్మీర్‌లో ముగుస్తుంది. 5 నెలల యాత్ర 3,500 కిలోమీటర్ల దూరం సాగనుంది. 12 కంటే ఎక్కువ రాష్ట్రాలను కవర్ చేయడానికి షెడ్యూల్ అయ్యింది. పాదయాత్ర ప్రతిరోజూ 25 కి.మీ సాగనుంది.

ఈ యాత్రలో బహిరంగ సభలు కూడా ఉంటాయి. వీటికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాబోయే ఎన్నికల పోరాటాల కోసం పార్టీ శ్రేణులను సమీకరించే ప్రయత్నంలో భాగంగా ఈ యాత్రను చేపట్టారు.

రాహుల్ గాంధీ ఆగస్టు 22న ఢిల్లీలో పౌర సమాజం, సంస్థలతో సమావేశమై వారి సమస్యలను వినడానికి, వారి ఆలోచనలను పంచుకుంటారని వర్గాలు తెలిపాయి. గాంధీ తన భారత్ జోడో యాత్ర, దాని ఉద్దేశాన్ని కూడా చర్చిస్తారు.

సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రకు ముందు రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై కూడా విభిన్న వర్గాలతో చర్చించనున్నారు. భారత్ జోడో యాత్రకు ముందు సమాజంలోని వివిధ వర్గాల కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులను కలవనున్నారు.

IPL_Entry_Point