Taapsee on Dobaaraa: దొబారా ఓ కల్ట్‌ మూవీగా నిలిచిపోతుంది: తాప్సీ-dobaaraa will become a cult movie says taapsee pannu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Taapsee On Dobaaraa: దొబారా ఓ కల్ట్‌ మూవీగా నిలిచిపోతుంది: తాప్సీ

Taapsee on Dobaaraa: దొబారా ఓ కల్ట్‌ మూవీగా నిలిచిపోతుంది: తాప్సీ

HT Telugu Desk HT Telugu
Aug 19, 2022 11:31 AM IST

Taapsee on Dobaaraa: తన లేటెస్ట్‌ మిస్టరీ డ్రామా దొబారా మూవీపై తాప్సీ పన్ను ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ చేసింది. ఆమెతోపాటు ఈ మూవీ మేకర్స్‌ కూడా దొబారా ఓ కల్ట్ మూవీగా నిలిచిపోతుందని అనడం విశేషం.

దొబారా మూవీలో తాప్సీ
దొబారా మూవీలో తాప్సీ

ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ శభాష్‌ మిథూ తర్వాత తాప్సీ పన్ను నటించిన సినిమా దొబారా. ఈ మూవీ శుక్రవారం (ఆగస్ట్‌ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ స్పెషల్‌ స్క్రీనింగ్స్‌ చూసి సెలబ్రిటీలు పాజిటివ్‌ రివ్యూలు ఇచ్చారు. ఈ మిస్టరీ డ్రామా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న విశ్వాసాన్ని మేకర్స్‌ వ్యక్తం చేశారు.

అయితే దొబారా కల్ట్‌ మూవీగా నిలిచిపోతుందని రిలీజ్‌కు ఒక రోజు ముందు మేకర్స్‌ ఏక్తా కపూర్‌, అనురాగ్‌ ఠాకూర్‌ ఓ నోట్‌ రిలీజ్‌ చేశారు. దీనిని తాప్సీ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ప్రేక్షకుల తెలివి తేటలను తాము తేలిగ్గా తీసుకోవడం లేదని కూడా తమ నోట్‌లో వాళ్లు చెప్పారు. దొబారా మూవీలో తాప్సీ తాను ఓ టీవీ సెట్‌ ద్వారా మాట్లాడిన ఓ బాలుడి జీవితాన్ని రక్షించే పాత్రలో కనిపించింది.

తాప్సీ షేర్‌ చేసిన మేకర్స్‌ నోట్‌లో ఏముందంటే.. "కొన్ని సినిమాలను కేవలం బాక్సాఫీస్‌ కలెక్షన్ల ద్వారా సక్సెస్‌ అంచనా వేస్తారు. మరికొన్ని సినిమాలను వాటి రేంజ్‌ ద్వారా చూస్తారు. ఇక మరికొన్ని సినిమాలు ఎంతలా ప్రేక్షకుల ఆదరణను పొందుతాయంటే.. అవి కల్ట్ మూవీస్‌గా నిలిచిపోతాయి. మేము ఆడియెన్స్‌కు ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం. ఇదొక కల్ట్‌ మూవీగా నిలిచిపోతుంది. మీడియా, ఇండస్ట్రీ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చాలా బాగుంది" అని అన్నారు.

ఈ నోట్‌ను తాప్సీ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. "ప్రీరిలీజ్‌ స్క్రీనింగ్స్‌ నుంచి మాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే బాక్సాఫీస్‌ కలెక్షన్ల కోసం చూస్తూ మంచి సినిమాలను ఎలా మిస్‌ అవుతున్నామో అనిపిస్తుంది. దొబారాలాంటి మూవీని తీయడానికి ధైర్యం చేసిన మేకర్స్‌ నుంచి ఈ నోట్‌ మీకోసం. వాళ్లు ఈ మూవీని కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావించారు. బాక్సాఫీస్‌ ఫలితంతో సంబంధం లేకుండా మేము ఓ మంచి సినిమా తీశామన్న ఆలోచనతో సెలబ్రేట్‌ చేసుకుంటాం. మేము గర్వపడే సినిమా తీశామని అనుకుంటున్నాం. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని తాప్సీ చెప్పింది.

<p>ఇన్ స్టాగ్రామ్ లో తాప్సీ షేర్ చేసిన నోట్</p>
ఇన్ స్టాగ్రామ్ లో తాప్సీ షేర్ చేసిన నోట్
IPL_Entry_Point

టాపిక్