Anurag Kashyap: తాప్సీ బూబ్స్‌ కంటే కూడా నావి పెద్దగా ఉంటాయి.. డైరెక్టర్‌ ఫన్నీ కామెంట్స్‌-i have bigger boobs than tapsee pannu says director anurag kashyap ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  I Have Bigger Boobs Than Tapsee Pannu Says Director Anurag Kashyap

Anurag Kashyap: తాప్సీ బూబ్స్‌ కంటే కూడా నావి పెద్దగా ఉంటాయి.. డైరెక్టర్‌ ఫన్నీ కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 02:32 PM IST

Anurag Kashyap: బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌.. నటి తాప్సీపై చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌పై వెరైటీగా స్పందించిన అనురాగ్‌.. ఇందులోకి తాప్సీని కూడా లాక్కొచ్చాడు.

అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్ను
అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్ను

బాలీవుడ్‌లో కాస్త డిఫరెంట్‌ టేస్ట్‌ ఉన్న డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌. గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌, నో స్మోకింగ్‌, దేవ్‌ డి, బాంబే వెల్వెట్‌, రామన్‌ రాఘవ్‌ 2.0లాంటి వినూత్నమైన సినిమాలు అతడు అందించాడు. ఇప్పుడు తాప్సీతో దొబారా మూవీ తీశాడు. వచ్చే శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో టీమ్‌ బిజీగా ఉంది.

ఇందులో భాగంగానే రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌పై అనురాగ్‌ కశ్యప్‌ను ప్రశ్నించగా.. అతడు ఫన్నీ ఆన్సర్‌ ఇచ్చాడు. ఎప్పుడైనా మీరు కూడా అలా చేస్తారా అని ఆర్జే సిద్ధార్థ్‌ అతన్ని అడిగాడు. దీనికి అనురాగ్‌ స్పందిస్తూ.. తాను అలా చేయాలంటే తనకున్న పెద్ద పొట్ట అడ్డొస్తుందని అతడు చెప్పడం విశేషం. ఆ సమయంలో పక్కనే ఉన్న తాప్సీ కాస్త ఇబ్బందిగా మొహం పెట్టింది.

దీనికి అనురాగ్‌ రియాక్ట్‌ అవుతూ.. "ఆమె ఎలాగూ భయపడుతుందిలెండి. ఎందుకంటే ఆమె బూబ్స్‌ కంటే కూడా నావి పెద్దగా ఉంటాయని ఆమె ఫీలింగ్‌" అని అనడంతో తాప్సీ సహా అక్కడున్న వాళ్లంతా పెద్దగా నవ్వారు. ఇక రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌పై మాట్లాడుతూ.. "అతడు రచ్చ రచ్చ చేశాడు. అతడు ఇంటర్నెట్‌నే కాదు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా బ్రేక్‌ చేశాడు. నేను దానిని తిరిగి ఎలా పొందాలి? ఇండియాలో ఉన్న ప్రతి మగాడు కూడా ఇదే ఆలోచించి అతన్ని విమర్శిస్తున్నారు" అని అన్నాడు.

ఇంటర్నేషనల్‌ మ్యాగైజన్‌ పేపర్‌ కోసం ఈ మధ్య రణ్‌వీర్‌ పూర్తి నగ్నంగా ఫొటోషూట్‌ చేసిన సంగతి తెలుసు కదా. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే అతని బాడీ షేప్‌ చూసి కొంతమంది ప్రశంసలు కూడా కురిపించారు. అలాంటి పర్సనాలిటీలు న్యూడ్‌ ఫొటోషూట్‌ చేస్తే ఓకే కానీ.. తనలాంటి వాళ్లు చేస్తే దారుణంగా ఉంటుందన్న ఉద్దేశంలో అనురాగ్‌ ఇలాంటి కామెంట్స్‌ చేశాడు.

అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో తాప్సీ పన్ను నటించిన దొబారా మూవీ ఈ శుక్రవారం (ఆగస్ట్‌ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదొక టైమ్‌ ట్రావెల్‌కు సంబంధించిన మూవీ. గతంలో లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించారు. దీనికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మెల్‌బోర్న్‌లో ఈ మధ్యే జరిగిన ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ఈ మూవీని ప్రదర్శించారు.

IPL_Entry_Point

టాపిక్