Mithali Raj: నువ్వు క్రికెట్‌నే మార్చేశావు.. మిథాలీ రిటైర్మెంట్‌పై శభాష్ మిథూ స్టార్ తాప్సీ
బాలీవుడ్‌లో ఇండియన్ వుమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు శభాష్ మిథూ అనే పేరు పెట్టగా.. ఇందులో ఆమె పాత్రను తాప్సీ పన్ను పోషిస్తోంది.
న్యూఢిల్లీ: సుమారు రెండున్నర దశాబ్దాల పాటు క్రికెట్‌లో కొనసాగిన మిథాలీ రాజ్ బుధవారం సడెన్‌గా తాను రిటైరవుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె తన రిటైర్మెంట్ ప్రకటనలో చెప్పింది. అయితే తాజాగా ఆమె రిటైర్మెంట్‌పై స్పందించింది మిథాలీ బయోపిక్‌లో నటిస్తున్న తాప్సీ పన్ను.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె మిథాలీకి ట్రిబ్యూట్ చెప్పింది. క్రికెట్‌లో ఆమె సాధించిన రికార్డుల గురించి చెబుతూ.. అసలు క్రికెట్‌నే మార్చిన ఘనత నీది అంటూ కొనియాడింది. "ఇండియన్ క్రికెట్ టీమ్ తరఫున యంగెస్ట్ కెప్టెన్. నాలుగు వరల్డ్‌కప్‌లలో కెప్టెన్‌గా ఉండి, రెండుసార్లు ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక ఇండియన్ క్రికెటర్. టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్. తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనే అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ క్రికెటర్.
వన్డేల్లో వరుసగా 7 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ఇండియన్. 23 ఏళ్ల కెరీర్‌లో ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్లిపోయింది. కొన్ని వ్యక్తిత్వాలు, వాళ్లు సాధించిన ఘనతలు జెండర్‌తో సంబంధం లేకుండా నిలిచిపోతాయి. నువ్వు గేమ్‌నే మార్చేశావు. ఇప్పుడు మా దృక్పథాన్ని మార్చుకోవాల్సిన సమయమిది. మా కెప్టెన్ ఎప్పుడూ చరిత్రలో నిలిచి ఉంటుంది" అని తాప్సీ కామెంట్ చేయడం గమనార్హం.
మూడేళ్ల కిందట 2019లో మిథాలీ బర్త్ డే సందర్భంగా తాను ఆమె బయోపిక్ శభాష్ మిథూలో నటించబోతున్నట్లు తాప్సీ ప్రకటించింది. నీకు బర్త్‌డే గిఫ్ట్ ఏమివ్వాలో నాకు తెలియదు కానీ.. శభాష్ మిథూతో స్క్రీన్‌పై నిన్ను నువ్వు చూసుకొని గర్వపడేలా చేస్తానని మాత్రం ప్రామిస్ చేస్తున్నాను అని ఆమె అప్పట్లో ట్వీట్ చేసింది. ఈ మూవీకి శ్రీజిత్ ముఖర్జీ డైరెక్టర్‌గా ఉన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్