తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

06 May 2024, 18:24 IST

    • SS Rajamouli - Bahubali Crown of Blood: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రేపు (మే 7) మీడియాతో మాట్లాడనున్నారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ కోసం ఆయన ప్రమోషన్స్ చేయనున్నారు.
Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?
Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు భారత సినీ ఇండస్ట్రీలో గొప్ప చిత్రాలుగా నిలిచాయి. బాహుబలి 2 చిత్రం అనేక రికార్డులను బద్దలుకొట్టింది. అయితే, అంతటి ఘన విజయం సాధించిన బాహుబలి పేరుతో రాజమౌళి ఇప్పుడు ఓ యానిమేటెడ్ సిరీస్ తీసుకొస్తున్నారు. బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ రానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది. ఈ తరుణంలో ఈ యానిమేటెడ్ సిరీస్ కోసం మీడియా ముందుకు రేపు (మే 7) రానున్నారు దర్శకుడు రాజమౌళి.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

ఎప్పుడంటే..

బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ కోసం రేపు (మే 7) మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల సమయంలో మీడియా ముందుకు దర్శకుడు రాజమౌళి రానున్నారు. హైదరాబాద్‍లోని ఏఎంబీ సినిమాస్ వద్ద ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగానే ఈ యానిమేటెడ్ సిరీస్ తొలి రెండు ఎపిసోడ్ల ప్రత్యేక స్క్రీనింగ్ ఉండనుంది. ఆ తర్వాత మీడియా ప్రశ్నలకు రాజమౌళి సమాధానాలు ఇస్తారు.

బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ మే 17వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్ కూడా వచ్చింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీ, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లోనూ ఈ సిరీస్ మే 17న హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో రానుంది.

బాహుబలి 1కు ప్రీక్వెల్‍గా బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ వస్తోంది. రక్తదేవ్ అనే రాజుతో బాహుబలి, భళ్లాలదేవ యుద్ధం చేయడం చుట్టూ ఈ సిరీస్ ఉండనుంది.

మహేశ్ మూవీ గురించి చెబుతారా..

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‍లో రాజమౌళి మరో బ్లాక్‍బస్టర్ సాధించారు. తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆయన సినిమా (SSMB 29) చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా.. అప్‍డేట్ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో రాజమౌళి ఏ ఈవెంట్‍లో పాల్గొన్నా.. ఆ ప్రాజెక్ట్ గురించి అప్‍డేట్ ఇస్తారా అనే ఆసక్తి పెరుగుతోంది. బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ కోసం రేపు (మే 7) ఆయన మీడియాతో మాట్లాడనుండగా.. మహేశ్‍తో మూవీ గురించి తప్పకుండా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆయన ఈ మూవీపై ఏమైనా అప్‍డేట్ చెబుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుంతో చూడాలి.

మహేశ్ బాబు - రాజమౌళి సినిమా షూటింగ్ ఆగస్టు లేకపోతే సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉందని ఇటీవల సమాచారం బయటికి వచ్చింది. గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఇది రూపొందనుంది. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తారనే రూమర్లు ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ కొత్త లుక్‍లో కనిపించనున్నారు.

ఇటీవల, కృష్ణమ్మ సినిమా ఈవెంట్‍లో మహేశ్‍తో సినిమా గురించి అప్‍డేట్ చెప్పాలని రాజమౌళిని దర్శకుడు అనిల్ రావిపూడి అడిగారు. దీంతో, అనిల్‍ను ముసుగేసి కొడితే రూ.10వేలు ఇస్తానంటూ సరదాగా అన్నారు రాజమౌళి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం