Baahubali The Crown of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే-baahubali the crown of blood animated series coming director ss rajamouli announces about trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baahubali The Crown Of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే

Baahubali The Crown of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 30, 2024 10:02 PM IST

Bahubali: The Crown of Blood Animated Series: ఇండియన్ సినీ పరిశ్రమలో రికార్డులను సృష్టించిన బాహుబలి మళ్లీ వచ్చేస్తోంది. యానిమేషన్ రూపంలో రానుంది. ఈ బహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ గురించి దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించారు.

Baahubali The Crown of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే
Baahubali The Crown of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే

Bahubali: The Crown of Blood: భారత సినీ పరిశ్రమ దశ, దిశను బాహుబలి సినిమాలు మార్చేశాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు ఎన్నో రికార్డులను బద్దలుకొట్టాయి. ప్రపంచమంతా భారత సినీ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాయి. తెలుగు సినీ పరిశ్రమ గర్వించేలా ఈ చిత్రాలు చేశాయి. 2015లో వచ్చిన బాహుబలి బ్లాక్‍బస్టర్ అయితే.. 2017లో దానికి సీక్వెల్‍గా వచ్చిన బాహుబలి 2 అనేక రికార్డులను బద్దలుకొట్టింది. రూ.1,000 కోట్ల మార్క్ సాధించిన తొలి భారతీయ చిత్రంతో పాటు అనేక రికార్డులను సాధించింది. అందరి మనసుల్లో బాహుబలి అనే పేరు నిలిచిపోయింది. ఆ ఇప్పుడు బాహుబలి మళ్లీ వస్తోంది. అయితే, ఈసారి యానిమేషన్ రూపంలో రానుంది. ఆ వివరాలివే..

యానిమేటెడ్ సిరీస్.. త్వరలో ట్రైలర్

బాహుబలి పేరుతో యానిమేటెడ్ సిరీస్ వస్తోంది. బహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఇది రానుంది. ఈ విషయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి నేడు (ఏప్రిల్ 30) ప్రకటించారు. ఈ సిరీస్‍పై అప్‍డేట్ ఇచ్చారు.

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ త్వరలో రానుందని రాజమౌళి ట్వీట్ చేశారు. బాహుబలి.. బాహుబలి అంటూ అరుపులు ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. “అతడి పేరును మాహిష్మతి ప్రజలు అతడి పేరును జపిస్తుంటే.. తిరిగిరాకుండా ప్రపంచంలో అతడిని ఏ శక్తి అడ్డుకోలేదు. యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్’ త్వరలో రానుంది” అని రాజమౌళి ట్వీట్ చేశారు.

అయితే, ఈ యానిమేటెడ్ సిరీస్ గురించి ఇతర వివరాలను ఇప్పుడు రాజమౌళి వెల్లడించలేదు. ట్రైలర్ వచ్చాక వివరాలను వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఈ యానిమేటెడ్ సిరీస్‍లో ఏ పాత్రలు ఉంటాయి.. ఓటీటీలో ఈ సిరీస్ వస్తుందా.. క్రియేటర్‌గా ఎవరు ఉంటారనే అనే విషయాలపై క్లారిటీ వస్తుంది. యానిమేటెడ్ సిరీస్ కావడంతో గ్రాఫిక్స్ కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఎలా ఉంటుందోనని ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి పెరిగిపోయింది.

బాహుబలి సినిమాల్లో మహేంద్ర బాహుబలి (శివుడు), అమరేంద్ర బాహుబలి పాత్రల్లో రెబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించారు. భల్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క శెట్టి, కట్టప్పగా సత్యరాజ్, శివగామిగా రమ్యకృష్ణ, బిజ్జలదేవగా నాజర్ నటించారు. బాహుబలి సినిమాలు, ఈ చిత్రంలో పాత్రలు ఐకానిక్‍గా నిలిచిపోయాయి.

అబ్బురపరిచిన బాహుబలి

బాహుబలి తొలి చిత్రంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రాజమౌళి.. బాహుబలి 2(2017)తో మరోస్థాయికి తీసుకెళ్లారు. యుద్ధ సన్నివేశాలు, పాత్రల మధ్య సంఘర్షణ, ఎమోషన్లు, డ్రామా, మాహిష్మతి రాజ్యం, గ్రాఫిక్స్ ఇలా అన్ని విషయాల్లో రాజమౌళి ప్రేక్షకులను కట్టిపడేశారు. బాహుబలి 2 ది కన్‍క్లూజన్ సినిమా రూ.1,800కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఎన్నో రికార్డును సాధించింది. తెలుగు, హిందీ సహా విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఇతర దేశాల్లోనూ ఈ మూవీకి విశేష ఆదరణ దక్కించుకుంది. దేశంలోనే టాప్ డైరెక్టర్ స్థాయికి రాజమౌళి ఎదిగారు. ప్రభాస్ కూడా పాన్ ఇండియా రేంజ్‍లో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించారు. ఆర్ఆర్ఆర్ (2022) చిత్రంతో రాజమౌళి గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయ్యారు.

బాహుబలి సినిమాలకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాలను నిర్మించారు. ఇటీవలే ఏప్రిల్ 28న బాహుబలి 2 చిత్రం ఏడేళ్లను పూర్తి చేసుకుంది.