SS Rajamouli's Bahubali: ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ss rajamoulis bahubali crown of blood to stream in disney plus hotstar kattapa as villain in this new mahishmati story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli's Bahubali: ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

SS Rajamouli's Bahubali: ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
May 02, 2024 03:18 PM IST

SS Rajamouli's Baahubali: ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సరికొత్తగా ఓటీటీలోకి వస్తోంది. మాహిష్మతి రక్తంతో రాసిన ఈ కొత్త కథలో కట్టప్పే విలన్ కావడం విశేషం. ఈ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో చూడండి.

ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. మాహిష్మతి రక్తంతో రాసిన కథ
ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. మాహిష్మతి రక్తంతో రాసిన కథ

SS Rajamouli's Baahubali: పాన్ ఇండియా లెవల్లో రాజమౌళి సృష్టించిన అద్భుతం బాహుబలి నుంచి ఓ సరికొత్త కథ రాబోతోంది. ఇది బాహుబలి, బాహుబలి 2 చెప్పని కథ. వాటికి ప్రీక్వెల్ గా వస్తున్న కథ. ఇందులో కట్టప్పే విలన్ కాగా.. రక్తదేవ్ అనే శతృవు సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్న ఆ కట్టప్పను ఎదుర్కోవడానికి బాహుబలి, భల్లాలదేవ చేతులు కలుపుతారు. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.

మాహిష్మతి రక్తంతో రాసిన సరికొత్త కథ

బాహుబలి మూవీ ద్వారా రాజమౌళి పరిచయం చేసిన రాజ్యం మాహిష్మతి. ఇప్పుడీ కల్పిత సామ్రాజ్యం మరో శతృవుతో పోరాడబోతోంది. ఆ శత్రువు పేరు రక్తదేవ్. అతని సైన్యానికి అధిపతి కట్టప్ప. తమకు శిక్షణ ఇచ్చిన వ్యక్తిపైనే మన సైన్యం ఎలా గెలుస్తుందంటూ నేరుగా బాహుబలి, భల్లాలదేవే రంగంలోకి దిగుతారు. ఈ సరికొత్త కథతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రూపొందించిన ఓ యానిమేషన్ సిరీస్ రాబోతోంది.

ఈ యాక్షన్ సిరీస్ హాట్‌స్టార్ లో మే 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ బాహుబలికి రాజమౌళి దర్శకుడిగా పని చేయగా.. ఈ బాహుబలికి అతడు ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. జీవన్ జే కాంగ్, నవీన్ జాన్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ ట్రైలర్ ను గురువారం (మే 2) హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఇందులో అమరేంద్ర బాహుబలిని భల్లాలదేవుడు వెన్నుపోటు పొడవడానికి ముందు కొత్త శత్రువుతో మాహిష్మతి చేసిన పోరాటాన్ని చూపించారు.

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే టైటిల్ తో ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తన జీవితం మొత్తం మాహిష్మతికే అంకితమిచ్చిన కట్టప్పే ఈ సరికొత్త కథలో అదే మాహిష్మతిపై పోరాటం చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. బాహుబలి ప్రపంచాన్ని యానిమేషన్ లో చూడాలనుకునే వారికి ఈ కొత్త సిరీస్ మంచి అనుభూతిగా చెప్పవచ్చు.

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అలా వచ్చిందే: రాజమౌళి

ఈ షో క్రియేటర్, ప్రొడ్యూసర్ రాజమౌళి ఈ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పై స్పందించాడు. "బాహుబలి ప్రపంచం చాలా పెద్దది. దానిని ఫిల్మ్ ఫ్రాంఛైజీ బాగా పరిచయం చేసింది. అయినా ఆ ప్రపంచంలో చూడటానికి ఇంకా చాలానే ఉంది. అక్కడి నుంచి వచ్చిందే ఈ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్. బాహుబలి, భల్లాలదేవుడి జీవితాల్లోని ఓ రహస్యాన్ని, ట్విస్టులను ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ కొత్త కథను యానిమేటెడ్ రూపంలో బాహు అభిమానుల ముందుకు తీసుకురావడం చాలా ఉత్సాహంగా ఉంది" అని రాజమౌళి అన్నాడు.

ఇక ఈ సరికొత్త బాహుబలిపై సిల్వర్ స్క్రీన్ బాహుబలి ప్రభాస్ కూడా స్పందించాడు. "ఇప్పటి వరకూ ఎవరూ చూడని ఈ బాహుబలి ప్రయాణంలో బాహుబలి, భల్లాలదేవుడు కలిసి రావడం చాలా ఎగ్జైటింగా ఉంది. సినిమాలో చూపించిన దాని కంటే ముందు జరిగిన స్టోరీయే ఈ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్. బాహు, భల్లాల జీవితాల్లోని ముఖ్యమైన అధ్యాయం ఇది. దీనిని యానిమేటెడ్ ఫార్మాట్లో తీసుకురావడం బాగుంది. బాహుబలి ప్రయాణంలోని ఈ కొత్త ప్రయాణాన్ని చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ప్రభాస్ అన్నాడు.

Whats_app_banner