SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..-i will give 10 thousand if anyone beat anil ravipudi says ss rajamouli after he asked for the ssmb 29 update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..

SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
May 01, 2024 10:29 PM IST

SS Rajamouli - Anil Ravipudi: కృష్ణమ్మ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడిపై సరదాగా ఆయన కామెంట్స్ చేశారు. అతడిని గుద్దితే రూ.10వేలు ఇస్తానన్నారు. ఎందుకంటే..

SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..
SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..

SS Rajamouli: కృష్ణమ్మ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‍కు దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరయ్యారు. కృష్ణమ్మ చిత్రంలో టాలెండెట్ హీరో సత్యదేవ్ హీరోగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఎస్ఎస్ రాజమౌళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణ సాగింది. ఆ వివరాలివే..

‘ఓపెనింగ్ డే ఎప్పుడో చెప్పాలి’

దర్శక ధీరుడు రాజమౌళి తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా (SSMB29) చేయనున్నారు. గ్లోబల్ రేంజ్‍లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది రూపొందనుంది. అయితే, ఆ సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడు అని రాజమౌళి చెప్పాలని అనిల్ రావిపూడి అడిగారు. దేవర గురించి కొరటాల శివను కూడా ప్రశ్నించారు. “రాజమౌళి స్పీచ్‍లో ఓపెనింగ్ డే ఎప్పుడు? ఓపెనింగ్ డే రోజు ఆయన సినిమా కథ చెబుతారు.. అసలు ఏ జానర్, ఏ సినిమా తీస్తున్నారో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది. ఆ రెండు విషయాలను చెబుతారని ఆశిస్తున్నాను” అని అనిల్ రావిపూడి అన్నారు. దీనికి రాజమౌళి స్పందించారు.

అనిల్‍ను గుద్దేస్తే పది వేలు ఇస్తా

మహేశ్ బాబుతో సినిమా గురించి అడగటంతో అనిల్ రావిపూడి గురించి సరదాగా స్పందించారు ఎస్ఎస్ రాజమౌళి. అతడిని ఎవరైనా గుద్దేస్తే రూ.10వేలు ఇస్తానని అన్నారు. “ఎవరైనా సరే. ఓ కెమెరా పట్టుకొని.. వెనకాలే నడుస్తూ.. ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే రూ.10వేలు ఇస్తా” అని రాజమౌళి సరదాగా అన్నారు.

రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌పై అనిల్ రావిపూడి అదే రేంజ్‍లో రెస్పాండ్ అయ్యారు. “దయచేసి ప్రైజ్‍మనీ తగ్గించండి సర్. ఓ రెండు రూపాయలని చెప్పండి. రూ.10వేలు అంటే వచ్చేస్తారు” అని అనిల్ స్పందించారు. ఈ సంభాషణ చాలా సరదాగా సాగింది.

తనకు ఇండస్ట్రీలో స్నేహితులు ఎవరో చెప్పాలని రాజమౌళికి ప్రశ్న ఎదురైంది. దీంతో ఎన్టీఆర్ అని కొందరు అరిచారు. అయితే, తారక్ (జూనియర్ ఎన్టీఆర్) తనకు ఫ్రెండ్ కాదని, తమ్ముడిలాంటి వాడని ఆయన అన్నారు. ఈగ నిర్మాత సాయి కొర్రపాటి, బాహుబలి నిర్మాత శోభూ యార్లగడ్డ తన క్లోజ్ ఫ్రెండ్స్ అని జక్కన్న చెప్పారు.

మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాకు ఇంకా సమయం ఉందని, త్వరలో అప్‍డేట్స్ వస్తాయని ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. కృష్ణమ్మ చిత్రానికి సమర్పకుడిగానూ కొరటాల ఉన్నారు.

కృష్ణమ్మ సినిమా గురించి..

సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ సినిమా మే 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి ట్రైలర్ నేడు (మే 1) వచ్చేసింది. విజయవాడ బ్యాక్‍డ్రాప్‍లో రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. హైవోల్టేజ్ యాక్షన్‍తో ట్రైలర్ అదిరిపోయింది. ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.

కృష్ణమ్మ మూవీలో సత్యదేవ్ సరసన అతిరా రాజ్ హీరోయిన్‍గా నటించగా.. అర్చన, కృష్ణ బూర్గుల, లక్ష్మణ్ మీసాల కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ గోపాల కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీని కృష్ణ కొమ్మాలపాటి నిర్మించగా.. కొరటాల శివ సమర్పిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందించారు.