VenkyAnil3: ఆ దర్శకుడితో విక్టరీ వెంకటేశ్ మూడోసారి.. సంక్రాంతి పోటీ మరింత తీవ్రం-venkyanil3 venkatesh third film with anil ravipudi after f2 and f3 will release set to release 2025 sankranthi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkyanil3: ఆ దర్శకుడితో విక్టరీ వెంకటేశ్ మూడోసారి.. సంక్రాంతి పోటీ మరింత తీవ్రం

VenkyAnil3: ఆ దర్శకుడితో విక్టరీ వెంకటేశ్ మూడోసారి.. సంక్రాంతి పోటీ మరింత తీవ్రం

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 09, 2024 08:20 PM IST

VenkyAnil3: విక్టరీ వెంకటేశ్ తదుపరి మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడితో ఆయన మూడోసారి కలిసి పని చేయనున్నారు. రిలీజ్ ప్లాన్‍ను కూడా మేకర్స్ వెల్లడించారు.

VenkyAni3: ఆ దర్శకుడితో విక్టరీ వెంకటేశ్ మూడోసారి.. సంక్రాంతి పోటీ మరింత తీవ్రం
VenkyAni3: ఆ దర్శకుడితో విక్టరీ వెంకటేశ్ మూడోసారి.. సంక్రాంతి పోటీ మరింత తీవ్రం (AFP)

VenkyAnil3: సీనియర్ హీరో, విక్టరీ వెంకటేశ్ మరోసారి దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‍లో వచ్చిన ఎఫ్2 (2019), ఎఫ్3 (2022) సినిమా మంచి హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్2 బ్లాక్ బస్టర్ కాగా.. ఎఫ్‍3 కూడా పర్వాలేదనిపించింది. ఇప్పుడు, వెంకీ - అనిల్ కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది. ఉగాది సందర్భంగా నేడు (ఏప్రిల్ 9) ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబోలో ఇది మూడో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టుకు వెంకీఅనిల్3 అనే వర్కింగ్ టైటిల్‍ను మేకర్స్ ప్రకటించారు. ఎఫ్2, ఎఫ్3ను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూజ్ చేస్తోంది.

హ్యాట్రిక్ కోసం..

వెంకీ - అనిల్ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నేడు అధికారికంగా ప్రకటించింది. “ఎంటర్‌టైన్‍మెంట్ పంచేందుకు మళ్లీ అద్భుతమైన ద్వయం వచ్చేస్తోంది. ఎస్‍వీసీ బ్యానర్ కింద విక్టరీ వెంకటేశ్, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టేందుకు చేతులు కలిపారు” అని ఆ ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది.

క్రైమ్ ఎంటర్‌టైనర్.. రిలీజ్ అప్పుడే

వెంకటేశ్ - అనిల్ కాంబోలో ఈ చిత్రం క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఓ వీడియోను కూడా ఎస్‍వీసీ పోస్ట్ చేసింది. “మాజీ పోలీస్, మాజీ గర్ల్ ఫ్రెండ్, అద్భుతమైన భార్య.. ఈసారి అద్భుతమైన ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌తో వచ్చేస్తున్నారు” అని వీడియోలో తెలిపింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తుండగా.. దిల్‍రాజు సమర్పిస్తున్నారు. ఈ మూవీకి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించనున్నారు. మరిన్ని ఎగ్జైటింగ్ వివరాలను త్వరలో తెలుపుతామని టీమ్ వెల్లడించింది.

సంక్రాంతి రేసు తీవ్రం

రవితేజ 75వ సినిమా ప్రకటన కూడా నేడు వచ్చింది. సామజవరగమన సినిమా రచయిత భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ కూాడా 2025 సంక్రాంతికే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసేశారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర కూడా ఇదివరకే సంక్రాంతి రిలీజ్‍ను లాక్ చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని టీమ్ ప్రకటించింది. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇప్పుడు, వెంకటేశ్ - అనిల్ రావిపూడి సినిమా కూడా 2025 సంక్రాంతికే వస్తుందని మూవీ టీమ్ అధికారికంగా ఫిక్స్ చేసింది. పండుగకే రావాలని ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి తన చిత్రం కూడా పోటీలో ఉంటుందని కింగ్ నాగార్జున కూడా గతంలోనే ప్రకటించారు. దీంతో టాలీవుడ్‍లో 2025 సంక్రాంతి రేసు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సీనియర్ స్టార్ హీరోలు బాక్సాఫీస్ వార్ చేసుకోనున్నారు. మరి, ప్లాన్ ప్రకారం ఈ చిత్రాలు సంక్రాంతికే వస్తాయా.. లేకపోతే ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి. అయితే, మరిన్ని సినిమాలు కూడా సంక్రాంతికి టార్గెట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు.

IPL_Entry_Point