Venkatesh: “పోతే పోతుంది.. ఆడితే ఆడుతుంది”: సైంధవ్ టీజర్ రిలీజ్ ఈవెంట్‍లో వెంకటేశ్ ఆన్సర్ అదుర్స్-i believe in our audience says venkatesh during saindhav teaser launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh: “పోతే పోతుంది.. ఆడితే ఆడుతుంది”: సైంధవ్ టీజర్ రిలీజ్ ఈవెంట్‍లో వెంకటేశ్ ఆన్సర్ అదుర్స్

Venkatesh: “పోతే పోతుంది.. ఆడితే ఆడుతుంది”: సైంధవ్ టీజర్ రిలీజ్ ఈవెంట్‍లో వెంకటేశ్ ఆన్సర్ అదుర్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 16, 2023 03:28 PM IST

Venkatesh on Saindhav Release: సైంధవ్ సినిమా టీజర్ వచ్చేసింది. యాక్షన్ అవతార్‌లో వెంకటేశ్ అదరగొట్టారు. అయితే, సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయడం కరెక్టేనా అని ఎదురైన ప్రశ్నకు వెంకీ సమాధానం ఇచ్చారు.

Venkatesh: “పోతే పోతుంది.. ఆడితే ఆడుతుంది”: సైంధవ్ టీజర్ రిలీజ్ ఈవెంట్‍లో వెంకటేశ్ ఆన్సర్ అదుర్స్
Venkatesh: “పోతే పోతుంది.. ఆడితే ఆడుతుంది”: సైంధవ్ టీజర్ రిలీజ్ ఈవెంట్‍లో వెంకటేశ్ ఆన్సర్ అదుర్స్

Venkatesh on Saindhav Release: విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్నారు వెంకీ. ఆయనకు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రంగా ఉంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ సైంధవ్ రిలీజ్ కానుంది. హిట్ 1, హిట్ 2 చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేశ్ కొలను.. సైంధవ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా టీజర్ నేడు వచ్చింది. ఇందుకోసం లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‍లో తనకు ఎదురైన ప్రశ్నలకు వెంకటేశ్ సమాధానం ఇచ్చారు.

యాక్షన్ సినిమాగా ఉన్న సైంధవ్‍ను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడం సరైన ఎంపికేనా అనే ప్రశ్న వెంకటేశ్‍కు ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. ఏ జానర్ అయినా.. ఎప్పుడైనా మంచి సినిమాను మన ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని వెంకటేశ్ అన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పోతే పోతుంది.. ఆడితే ఆడుతుంది అని వెంకీ చెప్పారు.

“నాకు ప్రేక్షకుల మీద నమ్మకం ఉంది. నా 75 చిత్రాలు పూర్తయ్యాయి. ఒక మంచి సినిమా వస్తే చూస్తున్నారని నాకు మొదటి రోజు నుంచి అర్థమవుతోంది. ఆ నమ్మకంతోనే ఇన్ని రోజులు కొనసాగుతున్నాం. ఈ సినిమా చూడడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతారు. ఇది కూడా కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమానే. అందులో ఎలాంటి సందేహం లేదు. విభిన్నమైన భావోద్వేగాలతో ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమాకు స్క్రిప్ట్ బలం. నేను ఎప్పుడూ స్టోరీలను నమ్ముతాను. ప్రేక్షకులు ఏ సీజన్ వచ్చినా.. ఎప్పుడొచ్చినా మంచి సినిమాలనే చూస్తున్నారు. అది తెలిసిపోయిందండి. సైలెంట్‍గా ఉండడం బెటర్. సినిమా వదిలిన తర్వాత పోతే పోతది.. ఆడితే ఆడుతది” అని వెంకటేశ్ చెప్పారు.

సైంధవ్ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, బేబి సారా, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరేమియా కీలకపాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందించారు. సైంధవ్ సినిమాలో సైకో అనే క్యారెక్టర్ చేస్తున్నారు వెంకటేశ్. ఫుల్ యాక్షన్ మూవీగా ఇది ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

సైంధవ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే.. ఈ ఏడాది డిసెంబర్ 22నే రిలీజ్ కావాలి. అయితే, అప్పుడు సలార్ వస్తుండటంతో సైంధవ్ జనవరి 13కు వాయిదా పడింది.

సంక్రాంతి సందర్భంగానే మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, హనుమాన్, రవితేజ ‘ఈగల్’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, నాగార్జున ‘నా సామిరంగ’ కూడా విడుదల కానున్నాయి. వీటితో సైంధవ్ పోటీ పడనుంది. దీంతో సంక్రాంతి పోటీ రసవత్తరంగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం