Hotstar Malayalam movies: హాట్‌స్టార్‌లో ఉన్న టాప్ ట్రెండింగ్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే-disney plus hotstar malayalam movies neru abraham ozler kannur squad falimy romancham neymar ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Disney Plus Hotstar Malayalam Movies Neru Abraham Ozler Kannur Squad Falimy Romancham Neymar Ott News In Telugu

Hotstar Malayalam movies: హాట్‌స్టార్‌లో ఉన్న టాప్ ట్రెండింగ్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే

Hari Prasad S HT Telugu
Apr 01, 2024 12:03 PM IST

Hotstar Malayalam movies: మలయాళం మూవీస్ అంటే ఇష్టపడే వాళ్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కు వెంటనే సబ్‌స్క్రైవ్ చేసుకోండి. ఓటీటీల్లో బెస్ట్ మలయాళం మూవీస్ ఉన్న ఓటీటీల్లో ఇదీ ఒకటి.

హాట్‌స్టార్‌లో ఉన్న టాప్ ట్రెండింగ్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే
హాట్‌స్టార్‌లో ఉన్న టాప్ ట్రెండింగ్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే

Hotstar Malayalam movies: హాట్‌స్టార్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోతోపాటు బెస్ట్ మలయాళం సినిమాలు ఉన్న ఓటీటీల్లో ఇదీ ఒకటి. ఇందులో మలయాళ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టిలాంటి వాళ్లు నటించిన ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలతోపాటు రాబోయే మూవీస్ ఏంటో కూడా ఇక్కడ చూడండి.

హాట్‌స్టార్ టాప్ మలయాళం మూవీస్

హాట్‌స్టార్ లో ఈ ఏడాది రిలీజైన రెండు సూపర్ హిట్ మలయాళ సినిమాలతోపాటు గతేడాది, అంతకుముందు రిలీజైన ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసేయండి.

అబ్రహం ఓజ్లర్

మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్ లో జయరాం లీడ్ రోల్ చేశాడు. ఈ సినిమా గతేడాది చివర్లో రిలీజై థియేటర్లలో రూ.40 కోట్లకుపైగా వసూలు చేసింది. హాట్‌స్టార్ లో ఇప్పుడీ మూవీ మలయాళ టాప్ ట్రెండింగ్స్ లో తొలిస్థానంలో ఉంది.

నేరు

మోహన్ లాల్ నటించిన కోర్టు రూమ్ డ్రామా ఈ నేరు. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ చూపు లేని అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని దోషిగా తేల్చే క్రమంలో వేసే ఎత్తుగడలతో నేరు చాలా ఇంట్రెస్టింగా సాగుతుంది.

మలైకొట్టై వాలిబన్

ఈ ఏడాది మోహన్ లాల్ నటించిన సినిమాల్లో ఈ మలైకొట్టై వాలిబన్ ఒకటి. ఈ స్టార్ హీరో కుస్తీ వీరుడిగా నటించిన మూవీ. ఈ మధ్యే హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది.

ఫలిమీ

గతేడాది డిసెంబర్ లో హాట్‌స్టార్ లోకి వచ్చిన మలయాళ కామెడీ డ్రామా ఈ ఫలిమీ. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాశీ యాత్రను ఎంతో సరదాగా తెరకెక్కించే ప్రయత్నమే ఈ ఫలిమీ మూవీ.

కన్నూరు స్క్వాడ్

మమ్ముట్టి నటించిన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ కన్నూరు స్క్వాడ్. క‌న్నూర్ స్క్వాడ్ ఓ సినిమాలా కాకుండా పోలీసులు ఇన్వేస్టిగేష‌న్‌ను నిజంగానే చూస్తున్న అనుభూతి క‌లుగుతుంది. క్రైమ్ అంశాల‌తో పాటు వృత్తికి, వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌ల‌కు మ‌ధ్య పోలీసుల‌కు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను ఈ సినిమాలో చూపించారు.

రొమాంచం

హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన మూవీ రొమాంచం. ఈ జానర్ లో తెలుగులోనూ చాలానే సినిమాలు వచ్చినా.. ఈ మలయాళ మూవీ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. దెయ్యాన్ని ఆకర్షించాలని యువకుల చేతే ఓజా బోర్డు ఆడించి వారి నుంచి హాస్యం రాబట్టుకునే ప్రయత్నం ఈ మూవీలో చేశారు.

నెయ్‌మార్

మాథ్యూ థామస్, నస్లెన్ కే గఫూర్ నటించిన ఈ సినిమా స్టోరీ ఓ కుక్క చుట్టూ తిరుగుతుంది. నిజానికి ఈ సినిమా టైటిల్ రోల్ పోషించింది ఈ కుక్కే. దీనివల్లే తమ సినిమాకు ఎంతో మంది ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చినట్లు డైరెక్టర్ సుధి మాడిసన్ చెప్పడం విశేషం.

ఇవే కాకుండా బెంగళూరు డేస్, కింగ్ ఆఫ్ కొత్త, ప్రేమమ్, భీష్మ, రోర్షాక్, బ్రో డాడీ, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ లాంటి ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు కూడా హాట్‌స్టార్ లో ఉన్నాయి. ఇక ఈ నెలలోనే ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్ కూడా రాబోతున్నాయి.

IPL_Entry_Point