Neru OTT Streaming: ఓటీటీలోకి అడుగుపెట్టిన మోహన్‍లాల్ బ్లాక్‍బాస్టర్ మూవీ నేరు.. తెలుగులోనూ..-neru movie streaming on disneyplus hotstar from today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Neru Ott Streaming: ఓటీటీలోకి అడుగుపెట్టిన మోహన్‍లాల్ బ్లాక్‍బాస్టర్ మూవీ నేరు.. తెలుగులోనూ..

Neru OTT Streaming: ఓటీటీలోకి అడుగుపెట్టిన మోహన్‍లాల్ బ్లాక్‍బాస్టర్ మూవీ నేరు.. తెలుగులోనూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 23, 2024 04:54 PM IST

Neru OTT Streaming: నేరు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ కోర్టు రూమ్ డ్రామా చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

Neru Movie OTT: ఓటీటీలోకి అడుగుపెట్టిన మోహన్‍లాల్ బ్లాక్‍బాస్టర్ మూవీ నేరు..
Neru Movie OTT: ఓటీటీలోకి అడుగుపెట్టిన మోహన్‍లాల్ బ్లాక్‍బాస్టర్ మూవీ నేరు..

Neru Movie OTT: మలయాళ మూవీ ‘నేరు’ బ్లాక్‍బాస్టర్ అయింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ నటించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం గత డిసెంబర్ 21వ తేదీన థియేటర్లలోకి వచ్చేంది. కేరళలో భారీ వసూళ్లను సాధించింది. తక్కువ బడ్జెట్‍లోనే రూపొందిన నేరుకు సుమారు రూ.85కోట్లకుపైగానే వసూళ్లు వచ్చాయి. ఈ మూవీపై ప్రశంసలు కూడా భారీగా వచ్చాయి. ఇప్పుడు, ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో మలయాళంలో మాత్రమే రిలీజైన నేరు.. ఓటీటీలోకి తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ‘నేరు’ సినిమా నేడు (జనవరి 23) స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. దీంతో ఈ మూవీకి ఓటీటీలో మంచి ఆదరణ దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మలయాళంలో సూపర్ టాక్ రావటంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఐదు భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్‌లో నేరు చిత్రం అడుగుపెట్టింది.

నేరు సినిమాను దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. గతంలో మోహన్ లాల్‍తో జీతూ తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని ఇతర భాషల్లోకి కూాడా రీమేక్ అయ్యాయి. ఇప్పుడు మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ మళ్లీ ‘నేరు’తో బ్లాక్‌బాస్టర్ సాధించారు. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి జీసెఫ్‍తో పాటు శాంతి మాధవి రచయితగా వ్యవహరించారు.

నేరు చిత్రంలో అనాశ్వర రాజన్, ప్రియమణి, శాంతి మహదేవి, సిద్ధిఖీ, జగదీశ్, కేబీ గణేశ్ కుమార్, శంకర్, మాథ్యూ వర్గీస్, హరిత నాయర్ కీలకపాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. విష్ణు శ్యాం సంగీతం అందించారు.

నేరు కథ ఇదీ..

సారా (అనాశ్వర రాజన్) అనే అంధురాలైన అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది. మైకేల్ (శంకర్) అనే యువకుడు ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు. ఆ తర్వాత ఓ క్లూతో పోలీసులు శంకర్‌ను అరెస్ట్ చేస్తారు. మైకేల్ తండ్రి ఓ పెద్ద బిజినెస్‍మెన్ కావటంతో తన కొడుకును విడిపించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది రాజశేఖర్ (సిద్ధిఖీ)ని కేసు వాదించేందుకు తీసుకొస్తాడు. రాజశేఖర్ రావటంతో బాధితురాలైన సారా తరఫున వాదించేందుకు ఇతర లాయర్లు వెనుకంజ వేస్తారు. ఆ సమయంలో గతంలో సస్పెండ్ అయిన లాయర్ విజయ్ మోహన్ (మోహన్ లాల్) మళ్లీ నల్లకోటు వేసుకొని.. సారా తరఫున వాదించేందుకు సిద్ధమవుతారు. మైకేల్‍ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు రాజశేఖర్ చాలా కుట్రలు పన్నుతారు. సాక్ష్యాలను పుట్టిస్తాడు. మరి వాటన్నింటినీ దాటుకొని ఈ కేసును విజయ్ మోహన్ గెలిచారా? మైకేల్‍ను దోషిగా నిరూపించారా?  పూర్ణిమ (ప్రియమణి) ఈ కేసులోకి ఎలా వచ్చారు? అన్నదే నేరు చిత్రం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

నేరు చిత్రం మొత్తం కోర్టు రూమ్ డ్రామాగానే ఉంటుంది. న్యాయవాదుల మధ్య వాదనలు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.