Abraham Ozler OTT Release Date: మమ్ముట్టి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్ ఓటీటీ డేట్ ఇదే
Abraham Ozler OTT Release Date: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రివీల్ చేసింది.
Abraham Ozler OTT Release Date: ఈ ఏడాది మలయాళం సినిమా ఇండస్ట్రీ వరుస హిట్లతో దూసుకెళ్తోంది. అయితే వీటిలో మొదటి హిట్ అయిన అబ్రహం ఓజ్లర్ మూవీ మొత్తానికి ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ మొత్తానికి ఈ నెలలోనే రాబోతున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది.
అబ్రహం ఓజ్లర్ ఓటీటీ రిలీజ్ డేట్
అబ్రహం ఓజ్లర్ మూవీ ఓ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రే అయినా ఓ సీరియల్ కిల్లర్ గా నటించడం గమనార్హం. జయరాం ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేశాడు. మలయాళ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ మూవీ మార్చి 20 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని శుక్రవారం (మార్చి 1) హాట్‌స్టారే అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా కేవలం మలయాళంలోనే వస్తుందా లేక మిగతా భాషల్లోనూ అందుబాటులో ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు. మిధున్ మాన్యుయెల్ థామస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జయరాం కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతేడాది డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజైంది.
అబ్రహం ఓజ్లర్ కథేంటి?
అబ్రహం ఓజ్లర్ (జయరాం) భార్యాపిల్లలు మిస్సవుతారు. వారు కనిపించకుండా పోయినా ఉన్నట్లుగా ఓజ్లర్ ఊహించుకుంటుంటాడు. వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురువుతుంటారు. వారి వద్ద హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకుతుంటాయి. ఆ హత్యల వెనకున్న ట్విస్ట్‌ను ఓజ్లర్ ఎలా ఛేదించాడు? అలెక్స్ (మమ్ముట్టి) సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణం ఏమిటి? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మరణానికి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. అబ్రహం ఓజ్లర్ మూవీకి మిదున్ థామస్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా జయరాం యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా అబ్రహం ఓజ్లర్ నిలిచింది. ఇందులో అలెగ్జాండర్ జోసెఫ్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో మమ్ముట్టి నటించాడు. ఈ సినిమాలో మమ్ముట్టి రోల్ గురించి రిలీజ్‌కు ముందు మేకర్స్ సస్పెన్స్‌గా ఉంచారు. సీరియల్ రోల్‌లో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. 30 నిమిషాల కంటే తక్కువ నిడివితోనే అతడి పాత్ర సినిమాలో కనిపిస్తుంది.
తెలుగులో జయరాం యాక్టింగ్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. 2018లో రిలీజై అనుష్క భాగమతి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు జయరాం. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ఖుషి, హాయ్‌నాన్న డిఫరెంట్ రోల్స్ చేశాడు. రవితేజ ధమాకాలో విలన్‌గా జయరాం కనిపించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోనూ జయరాం కీలక పాత్ర పోషిస్తోన్నాడు.