liger day 1 collection: లైగ‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - మిడ్ రేంజ్ హీరోల్లో విజ‌య్ రికార్డ్‌-vijay deverakonda liger day 1 worldwide box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Liger Day 1 Worldwide Box Office Collection

liger day 1 collection: లైగ‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - మిడ్ రేంజ్ హీరోల్లో విజ‌య్ రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Aug 26, 2022 09:43 AM IST

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)హీరోగా నటించిన లైగర్ (Liger) సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఎంతంటే...

రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ
రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ (Twitter)

liger day 1 collection:లైగర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఊహించిన దానికంటే తక్కువే వసూళ్లు వచ్చాయి. రెండేళ్ల తర్వాత విజయ్ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం, భారీ స్థాయిలో చేసిన ప్రమోషన్స్, సినిమాపై ఉన్న క్రేజ్, బజ్ కారణంగా గురువారం రోజు ఈ సినిమా దాదాపు పదిహేను కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

నెగెటివ్ టాక్ కారణంగా ఆ టార్గెట్ ను సినిమా చేరుకోలేకపోయింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి 9.57 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. నైజాంలో అత్యధికంగా 4.24 కోట్ల కలెక్షన్స్ సాధించింది. సీడెడ్ లో 1.32 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.27 కోట్లు వసూళ్లు వచ్చాయి. గుంటూర్ లో 83 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 64 లక్షలు, వెస్ట్ గోదావరిలో 39 లక్షలు, నెల్లూరులో 40 లక్షల కలెక్షన్స్ ను ఈ సినిమా సాధించింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 15.40 కోట్ల గ్రాస్, 9.57 కోట్ల షేర్ ను సాధించినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా తొలి రోజు 33. 12 గ్రాస్ ను ఈ సినిమా రాబట్టింది. ఓవర్ సీస్ లో గురువారం రోజు ఈ సినిమాకు 2.56 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

ఊహించిన దానికంటే షేర్ తక్కువగానే వచ్చినా ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల్లో లైగర్ మాత్రమే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించింది. అంతేకాకుండా మిడ్ రేంజ్ హీరోల్లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా విజయ్ దేవరకొండ లైగర్ నిలిచింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది.

WhatsApp channel