తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Ott Release Date: లైగ‌ర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఏ ప్లాట్‌ఫామ్‌లో

Liger OTT Release date: లైగ‌ర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఏ ప్లాట్‌ఫామ్‌లో

HT Telugu Desk HT Telugu

25 August 2022, 12:11 IST

  • Liger OTT Release date: విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay deverakonda) హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ (Puri jagannadh ) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లైగ‌ర్ సినిమా ఏ ఓటీటీలో ఎప్పుడూ ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

విజయ్ దేవరకొండ, అనన్యా పాండే
విజయ్ దేవరకొండ, అనన్యా పాండే (Twitter)

విజయ్ దేవరకొండ, అనన్యా పాండే

Liger OTT Release date: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన లైగ‌ర్ సినిమా ఆగస్టు 25న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్‌,మ‌ద‌ర్ సెంటిమెంట్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఆరంభం నుంచే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ ల‌భిస్తున్నా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే జ‌ర‌గ‌డంతో తొలిరోజు వ‌సూళ్లు రికార్డు క్రియేట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Devara vs NBK 109: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

కాగా ఈ సినిమా డిస్నీ ప్ల‌స్‌హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. అక్టోబ‌ర్ ఫ‌స్ట్‌వీక్‌లో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. భారీ మొత్తానికి ఓటీటీ డీల్ కుదిరిన‌ట్లు స‌మాచారం. తెలుగు,హిందీతో పాటు అన్ని భాష‌ల‌కు సంబంధించిన డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. శాటిలైట్ రైట్స్‌ను స్టార్ సంస్థ సొంతం చేసుకున్న‌ది. హిందీ వెర్ష‌న్ స్టార్ గోల్డ్‌,తెలుగు వెర్షన్ స్టార్ మాలోని రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు.

విజ‌య్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఈ సినిమాను క‌ర‌ణ్‌జోహార్‌,అపూర్వ మెహ‌తా,పూరి జ‌గ‌న్నాథ్‌,ఛార్మి క‌లిసి నిర్మించారు. అన‌న్యా పాండే హీరోయిన్‌గా న‌టించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం