తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr In Oscars Race As The Movie Competing In Two Categories

RRR in Oscars: ఆ రెండు ఆస్కార్స్‌ రేసులో ఆర్‌ఆర్‌ఆర్‌!

HT Telugu Desk HT Telugu

16 September 2022, 13:36 IST

    • RRR in Oscars: ఈసారి ఆస్కార్స్‌ రేసులో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఓ పాపులర్‌ ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ కథనం ప్రకారం.. రెండు అకాడెమీ అవార్డుల రేసులో ఈ మూవీ ఉంది.
ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్

RRR in Oscars: ఆస్కార్స్‌ రేసులో ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం కాదు కదా.. కనీసం నామినేషన్ల లిస్ట్‌లో ఉండాలన్నా అంత సులువు కాదు. అయితే ఈసారి మన టాలీవుడ్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ మాత్రం ఆస్కార్స్‌ నామినేషన్ల లిస్ట్‌లో ఉండటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా వెరైటీ అనే పాపులర్‌ ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ ప్రకారం రెండు కేటగిరీల్లో ఈ మూవీ రేసులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోల లీక్‍తో దర్శకుడు సీరియస్.. కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నారంటే..

Zee Telugu New Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ జానకి రామయ్యగారి మనవరాలు.. ఎప్పటి నుంచంటే?

Heeramandi OTT Streaming: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన హీరామండి వెబ్ సిరీస్: వివరాలివే

Anupamaa Serial: ఇండియాలోనే నంబర్ వన్ టీవీ సీరియల్ నటి కాషాయ కండువా కప్పేసుకుంది.. బీజేపీలో చేరిన రూపాలి గంగూలీ

వెరైటీ మ్యాగజైన్‌ అంచనా ప్రకారం.. బెస్ట్‌ ఇంటర్నేషనల్ ఫీచర్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ (దోస్తీ) కేటగిరీల్లో ట్రిపుల్‌ ఆర్‌ మూవీ పోటీ పడే అవకాశం ఉంది. అయితే ఈ నామినేషన్ల ఫైనల్‌ లిస్ట్‌ మాత్రం అకాడెమీయే ఖరారు చేస్తుంది. రానున్న నెలల్లో ఈ లిస్ట్‌ వస్తుంది. ఈసారి ఆస్కార్స్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉండనుందన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నా.. తాజాగా ఓ ఇంటర్నేషనల్‌ మ్యాగజైనే ఈ అంచనా వేయడం విశేషం.

రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో సూపర్‌ సక్సెసైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా వసూలు చేసింది. అటు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత హాలీవుడ్‌ను కూడా ఆకర్షించింది. అక్కడి డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఈ మూవీని ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

ఆస్కార్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌

తాజాగా వెరైటీ అనే ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ పోటీపడబోయే కేటగిరీలను అంచనా వేసింది. ఇందులో మొదటిది బెస్ట్ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతోపాటు అర్జెంటీనా 1985, బార్డో (లేదా ఫాల్స్‌ క్రానికల్‌ ఆఫ్‌ ఎ హ్యాండ్‌ఫుల్‌ ఆఫ్‌ ట్రూత్స్‌), క్లోజ్‌ అండ్‌ హోలీ స్పైడర్‌ మూవీలు కూడా ఉన్నాయి.

ఇక బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని దోస్తీ పోటీ పడనుంది. ఈ కేటగిరీలో దోస్తీ సాంగ్‌తోపాటు ఎవరిథింగ్‌ ఎవరివేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, స్ట్రేంజ్‌ వరల్డ్‌, టాప్‌ గన్‌ మావెరిక్‌, టర్నింగ్ రెడ్‌ మూవీస్‌లోని సాంగ్స్‌ కూడా పోటీ ఉన్నాయి.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఒలివియా మోరిస్, ఆలియా భట్, అజయ్ దేవ్ గన్, శ్రియ శరణ్ ఈ ఆర్ఆర్ఆర్ మూవీలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. కీరవాణి కంపోజ్ చేసిన ఈ మూవీ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆస్కార్స్ రేసులో ఉంటుందని భావిస్తున్న దోస్తీ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.