Ram Charan: రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా-ram charan and gowtam tinnanuri to begin shooting for rc 16 on september ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా

Ram Charan: రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 10:05 AM IST

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోగా జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి(Gowtam tinnanuri) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లుకానుందంటే...

రామ్ చ‌ర‌ణ్
రామ్ చ‌ర‌ణ్ (twitter)

ఆర్ఆర్ఆర్ తో ఈ ఏడాది భారీ కమర్షియల్ హిట్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ సక్సెస్ త‌ర్వాత శంక‌ర్ సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు రామ్‌చ‌ర‌ణ్‌, పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియ‌న్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ డిఫ‌రెంట్ షేడ్స్ తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ యాభైశాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యేవ‌ర‌కు ప్రొడ్యూస‌ర్ గిల్డ్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అప్ప‌టివ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్‌ను ఆపివేస్తున్న‌ట్లు నిర్మాత దిల్‌రాజు ప్ర‌క‌టించారు. ఈ స‌మ‌స్య‌లు కొలిక్కి రావ‌డానికి మ‌రికొన్ని రోజులు గ్యాప్ ప‌ట్టేలా ఉంది. ఈ గ్యాప్‌లో ఇండియ‌న్ 2 సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్టేందుకు శంక‌ర్ రెడీ అయ్యారు. సెప్టెంబ‌ర్ ప్ర‌థ‌మార్థంలో ఇండియన్ 2 మొద‌లుకానుంది.

మ‌రోవైపు రామ్‌చ‌రణ్ కూడా ఈ విరామాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. గౌత‌మ్ తిన్న‌నూరి సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. తొలుత శంక‌ర్ ప్రాజెక్ట్ పూర్త‌యిన త‌ర్వాతే గౌత‌మ్ తిన్న‌నూరి చిత్రాన్ని మొద‌లుపెట్టాల‌ని రామ్ చరణ్ భావించారు. అనివార్య పరిస్థితుల కారణంగా బ్రేక్ రావ‌డంతోనే అనుకున్న టైమ్ కంటే ముందుగానే షూటింగ్‌ను మొద‌లుపెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో గౌత‌మ్ తిన్న‌నూరి సినిమా కోసం రామ్‌చ‌ర‌ణ్ యాక్ష‌న్ లోకి దిగ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్, ఎన్వీ ప్రసాద్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

IPL_Entry_Point