తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heeramandi Ott Streaming: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన హీరామండి వెబ్ సిరీస్: వివరాలివే

Heeramandi OTT Streaming: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన హీరామండి వెబ్ సిరీస్: వివరాలివే

01 May 2024, 14:18 IST

    • Heeramandi OTT Streaming: హీరామండి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చింది.
Heeramandi OTT Streaming: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన హీరామండి వెబ్ సిరీస్: వివరాలివే
Heeramandi OTT Streaming: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన హీరామండి వెబ్ సిరీస్: వివరాలివే

Heeramandi OTT Streaming: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన హీరామండి వెబ్ సిరీస్: వివరాలివే

Heeramandi OTT Streaming: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భాన్సాలీ రూపొందించిన హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. చాలా మంది ఎదురుచూస్తున్న ఈ గ్రాండ్ పీరియడ్ డ్రామా సిరీస్ నేడు (మే 1) ఓటీటీలో అడుగుపెట్టింది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావ్ హైదరి, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ఈ హైబడ్జెట్ వెబ్ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు.

ట్రెండింగ్ వార్తలు

Shrimad Ramayanam TV Serial : తెలుగులో వస్తున్న శ్రీమద్ రామాయణం సీరియల్: ప్రారంభ తేదీ, టైమింగ్స్ ఇవే: కాంటెస్ట్ కూడా..

Allu Arjun at Dhaba: దాబాలో భార్యతో కలిసి అల్లు అర్జున్ లంచ్.. ఫొటోలు వైరల్.. ఎక్కడో తెలుసా?

Mohanlal L2 Empuraan first look: మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మలయాళ స్టార్

Dhee Promo: ఢీషోకు స్పెష‌ల్ గెస్ట్‌గా కాజ‌ల్ - గ్రాండ్ ఫినాలే చేరుకునే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవ‌రంటే?

తెలుగులోనూ స్ట్రీమింగ్

హీరామండి వెబ్ సిరీస్ నేడు (మే 1) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియోల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అలాగే, 9 విదేశీ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం మొత్తంగా 14 భాషల్లో హీరామండి సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్‍లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి.

బాలీవుడ్‍లో గ్రాండ్‍నెస్‍తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. దశాబ్దాల నుంచి స్టార్ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే, ఓటీటీల్లో భన్సాలీకి హీరామండినే తొలి వెబ్ సిరీస్‍గా ఉంది. దీంతో ఆయన ఈ సిరీస్‍ను ఎలా రూపొందించారోనని కొంతకాలంగా చాలా ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా ప్రతీది ఈ సిరీస్‍పై అంచనాలను పెంచాయి. అయితే, ఎట్టకేలకు నేడు ఈ వెబ్ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

స్టోరీ లైన్ ఇదే..

భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలోని 1930, 1940ల కాలం బ్యాక్‍డ్రాప్‍లో హీరామండి వెబ్ సిరీస్ ఉంటుంది. హీరామండి అనే రెడ్‍లైట్‍ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగే సంఘర్షణ, కుట్రల చుట్టూ ఈ సిరీస్ రూపొందింది. హీరామండి ప్రాంతంలో నివసించే తవైఫ్స్ గురించి ఈ సిరీస్‍లో ఉంటుంది. అలాగే, భారత స్వాతంత్య్ర పోరాటం కూడా ఈ సిరీస్‍లో ఉంది. హీరామండి ప్రాంతాన్ని శాసించే హుజూర్ స్థానాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాలా).. సొంతం చేసుకుంటారు. అయితే, ఆమెను పతనం చేసేందుకు, ఆధిపత్యం చెలాయించేందుకు ఫరదీన్ (సోనాక్షి సిన్హా) ప్రయత్నాలు చేస్తారు. అయితే, మరికొందరు కూడా ఆ స్థానంపై కన్నేస్తారు. కాగా, హీరామండి ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‍లోని లాహోర్‌లో ఉంది.

హీరామండి వెబ్ సిరీస్‍లో తాహా షా, జేసన్ షా, శేఖర్ సుమన్, పర్హీద్ ఖాన్, ఇంద్రేశ్ మాలిక్ కూడా కీరోల్స్ చేశారు. ఈ సిరీస్‍కు మోయిన్ బేగ్ కథ అందించగా.. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. భాన్సాలీనే సంగీతం అందించడంతో పాటు నిర్మించారు.

రెస్పాన్స్ ఇలా..

హీరామండి వెబ్ సిరీస్‍కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్‍లో క్యారెక్టర్లు చాలా స్ట్రాంగ్‍గా ఉన్నాయని, సంఘర్షణ, డ్రామా ఆకట్టుకునేలా ఉందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మరోసారి తన మార్క్ చూపించారని పోస్టులు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ చాలా గ్రాండ్‍గా ఉందని అంటున్నారు. భారీ సెట్లు, మ్యూజిక్ కూడా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ సిరీస్‍కు ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం