Heeramandi OTT: సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండి’ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్‍గా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Heeramandi OTT Web Series Trailer: స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. ఇంట్రెస్టింగ్ డ్రామా, భారీతనంతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఆ వివరాలివే..
Heeramandi OTT: బాలీవుడ్‍లో చాలా బ్లాక్ బాస్టర్, గ్రాండ్ సినిమాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల్ భన్సాలీ.. ఓటీటీలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఆయన దర్శకత్వంలో ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్‍పై భారీ క్రేజ్ ఉంది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా,అదితి రావ్ హైదరి, షార్మీన్ సేగల్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ హీరామండి వెబ్ సిరీస్ ట్రైలర్ నేడు (ఏప్రిల్ 9) రిలీజ్ అయింది.
ట్రైలర్ ఇలా..
భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో హీరామండి వెబ్ సిరీస్ రూపొందింది. హీరామండి అనే ప్రాంతంలో సాగే స్టోరీ ఇది. హీరామండిలో ఓ భారీ వేశ్యగృహాన్ని నడుపుతుంటారు మల్లికాజాన్ (మనీషా కొయిరాల). ఆ ప్రాంతాన్ని ఆమె శాసిస్తుంటారు. అయితే, తన మాజీ శత్రువు కూతురు ఫరీదన్ (సోనాక్షి సిన్హా).. మల్లికాజాన్‍ను దెబ్బకొట్టి హీరామండి హుజూర్ అవ్వాలని టార్గెట్ చేస్తుంది. దీంతో ఆ వేశ్యగృహంలో కుట్రలు, అనూహ్య ఘటనలు, టెన్షన్ పెరుగుతుంది.
మరోవైపు అదే సమయంలో దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతుంటుంది. మల్లికాజాన్ కూతుర్లలో ఒకరైన్ బిబ్బో జాన్ (అదితి రావ్ హైదరి).. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటారు. పోరాటాలు చేస్తారు. హీరామండిలో ఉండే వారిని కూడా ఉద్యమంలో పాల్గొనాలని స్ఫూర్తి కలిగిస్తారు. మల్లికాజాన్ చిన్నకూతురు ఆలమ్‍జెబ్ (షార్మిన్ సేగల్).. ఓ నవాబు తాజ్‍దార్ (తాహా షా బాదుషా)ను ప్రేమిస్తుంది. హీరామండి నిబంధనలను బేఖాతరు చేస్తుంది. హీరామండిలో అధికారమైన హుజార్ హోదా కోసం మల్లికాజాన్, ఫరీదన్ మధ్య పోరు తీవ్రమవుతుంది. హీరామండి నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్లిందనేదే ఈ వెబ్ సిరీస్‍లో చూడాలి.
హీరామండి ట్రైలర్ ఇంటెన్స్ డ్రామా, కుట్రలు, ఆధిపత్యం కోసం పోరాటం, ఎమోషన్లు, స్వాతంత్య్ర ఉద్యమంతో ఇంట్రెస్టింగ్‍గా ఉంది. సంజయ్ లీలా భన్సాలీ మార్క్ గ్రాండ్‍నెస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సిరీస్‍కు సంగీతం కూడా ఆయనే అందించారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఈ సిరీస్‍కు నిర్మాత కూడా ఆయనే. సినిమాటోగ్రఫీ కూడా బాగా కుదిరింది.
హీరామండి సిరీస్‍లో మనీషా కొయిరాలా, సోనాక్షి,అదితి రావ్ హైదరి, సేగల్‍తో పాటు రిచా చద్దా, శేఖర్ సుమన్, ఫర్దీన్ ఖాన్, ఆధ్యనన్ సుమన్, తాహా షా కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్లో అందరి పర్ఫార్మెన్స్ అద్భుతంగా అనిపించింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
హీరామండి వెబ్ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 1వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది నెట్‍ఫ్లిక్స్.
హీరామండి వెబ్ సిరీస్‍ను సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావించి.. గ్రాండ్‍గా తెరకెక్కించారు. 2022లోనే ఈ సిరీస్ షూటింగ్ మొదలైంది. అయితే, షూటింగ్ ఆలస్యమైంది. కొన్నిసార్లు బ్రేక్‍లు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు ఈ సిరీస్ పూర్తయింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. పాజిటివ్‍గా టాక్ వస్తే వ్యూయర్‌షిప్‍లో ఈ సిరీస్ రికార్డులను బద్దలుకొట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి.
టాపిక్