Netflix: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతున్న క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్.. 18 దేశాల్లో ట్రెండింగ్-the indrani mukerjea story buried truth gets huge views on netflix ott platform trending in top 10 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతున్న క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్.. 18 దేశాల్లో ట్రెండింగ్

Netflix: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతున్న క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్.. 18 దేశాల్లో ట్రెండింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 09, 2024 02:20 PM IST

Netflix OTT: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍‍ఫామ్‍లో ది ఇంద్రాణి ముఖర్జియా బరీడ్ ట్రూత్ సిరీస్ దూసుకెళుతోంది. ట్విస్టులతో కూడిన ఈ డాక్యు సిరీస్‍కు వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. చాలా దేశాల్లో ట్రెండ్ అవుతోంది.

Netflix: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతున్న క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్
Netflix: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతున్న క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్

Netflix: ఇటీవలి కాలంలో ఓటీటీల్లో డాక్యుమెంటరీ సిరీస్‍లకు ఆదరణ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా సంచలన కేసుల ఆధారంగా రూపొందిన క్రైమ్ సిరీస్‍లపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్‍కు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది. అందులోనూ ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా ఉండడంతో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది.

ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్ సిరీస్‍పై మొదటి నుంచే చాలా మందికి ఆసక్తి నెలకొంది. కోర్టులో కేసుల వల్ల ఆలస్యమైనా ఎట్టకేలకు ఈ సిరీస్ ఫిబ్రవరి 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ప్రారంభం నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోంది.

గ్లోబల్ రేంజ్‍లో..

ది ఇంద్రాణి ముఖర్జియా డాక్యు సిరీస్‍కు నానాటికీ వ్యూస్ పెరుగుతున్నాయి. భారత్‍తో పాటు కెనడా, ఆస్ట్రేలియా సహా సుమారు 18 దేశాల్లో ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‍లో టాప్-7లో ఈ సిరీస్ నిలిచింది. వారంలోనే ఈ డాక్యు సిరీస్‍కు 2.2 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. 6.9 మిలియన్ వాచ్ హవర్స్ దక్కించుకుంది.

మొత్తంగా అంచనాలకు మించి ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ దుమ్మురేపుతోంది. షీనా బోరా హత్య కేసులో చాలా ట్విస్టులు ఉండడం, దాన్ని ఈ సిరీస్‍లో ఎఫెక్టివ్‍గా చూపించడంతో భారీ ఆదరణ దక్కించుకుంటోంది.

కోర్టులో కేసు తర్వాత..

ది ఇంద్రాణి ముఖర్జియా సిరీస్ కోర్టు కేసులను ఎదుర్కొంది. షీనా బోరా కేసు విచారణ దశలో ఉండటంతో ఈ సిరీస్‍ను ఆపాలని కోర్టుకు వెళ్లింది సీబీఐ. కింది కోర్టు నిరాకరించడంతో బాంబే హైకోర్టుకు కూడా వెళ్లింది సీబీఐ. ముందుగా సీబీఐ అధికారులకు స్క్రీనింగ్ తర్వాత.. ఈ సిరీస్ ఎట్టకేలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. వారం ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

షీనా బోరా మర్డర్ కేసు దేశాన్ని కుదిపేసింది. 2012 ఏప్రిల్‍లో షీనా హత్యకు గురయ్యారు. అయితే, మూడేళ్ల తర్వాత 2015లో ఈ హత్య ఉదంతం బయటికి వచ్చింది. వేరే కేసులో పట్టుడిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ ఈ హత్య గురించి సమాచారం పోలీసులకు చెప్పాడు. దీంతో షీనా హత్య వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను 2015లో అరెస్టు చేయడం సంచలనంగా మారింది.

షీనా బోరా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్య సంజీవ్ ఖన్నా, డ్రైవర్ సహా మరికొందరు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విచారణ సాగిన కొద్దీ నెవ్వెర పరిచే విషయాలు బయటికి వచ్చాయి. దీంతో దేశం దృష్టిని ఈ కేసు ఆకర్షించింది. ఇంద్రాణి ముఖర్జియా సుమారు ఏడేళ్ల పాటు జైలులో ఉన్నారు. 2022లో ఆమెకు బెయిల్ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె బయటే ఉన్నారు. ఈ కేసులో ఇతర నిందితులకు కూడా బెయిల్ మంజూరైంది. అయితే, సీబీఐ ఈ కేసు విచారణను కొనసాగిస్తోంది.

Whats_app_banner