Indrani Mukerjea Netflix : ట్విస్ట్‌లు.. చీకటి రహస్యాలు.. అసలేంటి ఈ ఇంద్రాణి ముఖర్జీ- షీనా బొరా కేసు?
What is Indrani Mukerjea case : నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీతో.. ఇంద్రాణి ముఖర్జీ- షీనా బొరా కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అసలేం జరిగింది? ఏంటి ఈ కేసు? ఇక్కడ చూడండి..
What is Sheena Bora Murder Case : నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన 'ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్' డాక్యుమెంటరీకి లైన్ క్లియర్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ రిలీజ్‌పై స్టే విధించాలని సీబీఐ వేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ? అని అందరిలో ఆసక్తి మొదలైంది. అసలెవరు ఈ ఇంద్రాణి ముఖర్జీ? ఆమెకు- షీనా బొరా హత్య కేసుకు సంబంధం ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
అసలేంటి ఈ షీనా బొరా కేసు?
ఇది 2012లో ముంబైలో జరిగిన కథ. 25ఏళ్ల షినా బొరా అనే మహిళ.. ముంబై మెట్రో 1లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సమయం అది. 2012 ఏప్రిల్ 14న ఆమె అనూహ్యంగా అదృశ్యమైపోయింది. అక్కడి నుంచి ఈ కేసు చాలా మలుపులు తిరిగింది.
షినా బొరా కేసుపై చాలా ఏళ్ల పాటు దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఆమె తల్లి, మీడియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీని 2015 ఆగస్ట్‌లో అరెస్ట్ చేశారు. ఇంద్రాణి ముఖర్జీ రెండో భర్త పీటర్ ముఖర్జీ, వారి డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌లను కూడా అదే సమయంలో అరెస్ట్ చేశారు. వారిపై.. కిడ్నాప్, మర్డర్, మృతదేహాన్ని అదృశ్యం చేయడం వంటి కేసులు వేశారు.
Indrani Mukerjea case netflix : 2015లో ఈ వ్యవహారం బయటపడింది! శ్యామ్వర్ రాయ్‌పై అక్రమ ఆయుధాల కేసు పడగా.. పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది! చివరికి.. పోలీసులకు ఇంద్రాణిపై అనుమానాలు పెరిగాయి. ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు.. చివరికి ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు.
షీనా బొరాను ఎలా చంపారు? అన్న వివరాలను పోలీసులు వెల్లిడించారు. 2012 ఏప్రిల్‌లో ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌లు.. షీనా బొరాను కారులో గొంతు నులిమి చంపేశారు.
రాయ్ ప్రకారం.. షీనా బొరా మర్డర్‌ని పక్కాగా ప్లాన్ చేశాము. బాడీని ఎక్కడ పడేయాలి? అన్న విషయంపై ఇంద్రాణి స్వయంగా లొకేషన్ని సర్వే చేసింది. 2012 ఏప్రిల్ 24న.. ఖన్నా, షీనాను చంపేశాడు. బాంద్రాలోని ఓ వీధిలో ఈ ఘటన జరిగింది. అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని.. వోర్లిలోని ఇంద్రాణి ఇంటికి తీసుకెళ్లారు. ఓ బ్యాగ్‌లో మృతదేహాన్ని కుక్కి, కారులో పెట్టారు. అక్కడి నుంచి గగోడే అనే గ్రామానికి వెళ్లారు ఇంద్రాణి ముఖర్జీ, రాయ్, సంజీవ్ ఖన్నా. అక్కడే మృతదేహాన్ని పడేశారు.
Indrani Mukerjea Sheena Bora case : విచారణలో భాగంగా.. ఖన్న, రాయ్‌లు నిజం ఒప్పుకున్నారు. కానీ ఇంద్రాణీ ముఖర్జీ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెబుతూ వచ్చింది. షీనా బొరా ఇంకా బతికే ఉందని, అమెరికాలో ఉంటోందని చెప్పుకొచ్చింది.
2021 నవంబర్‌లో ఇంద్రాణి ముఖర్జీ బెయిన్ పిటిషన్‌ని బాంబే హైకోర్టు కొట్టివేసింది. కానీ 2022 మేలో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
హత్య చేయడానికి కారణం ఏంటి?
Sheena Bora alive : దర్యాప్తులో భాగంగా.. ముఖర్జీ కుటుంబంలోని అనేక చీకటి కోణాలు బయటకి వచ్చాయి. పీటర్ ముఖర్జీ, అతని మొదటి భార్యకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా.. పీటర్ ముఖర్జీని ఇంద్రాణి పెళ్లి చేసుకుంది. కానీ.. ఇంద్రాణి కూతురు షీనా.. పీటర్ ముఖర్జీ కొడుకు రాహుల్‌తో లివ్-ఇన్ రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. షీనాకు రాహుల్.. వరుసకు స్టెప్ బ్రెదర్ అవుతాడు. ఈ రిలేషన్‌ని పెద్దలు వ్యతిరేకించడంతో పాటు ఆర్థిక వివాదాలే.. షీనా బొరా హత్యకు కారణం అని సీబీఐ తేల్చి చెప్పింది. ఇందులో పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉందని పేర్కొంది.
తనని అరెస్ట్ చేసిన తర్వాత.. పలు సంచలన ఆరోపణలు చేశారు ఇంద్రాణి ముఖర్జీ. షీనా బొరా తన కూతురు కాదని, సోదరి వరుస అవుతుందని అన్నారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
'స్టే విధించలేము..'
వాస్తవానికి ఇంద్రాణి ముఖర్జీ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 23న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ విడుదలపై స్టే విధించాలని కోర్టుకు వెళ్లింది సీబీఐ. డాక్యుమెంటరీని సీబీఐకి చూపించాలని నెట్‌ఫ్లిక్స్‌కి కోర్టు చెప్పింది. కాగా.. ఈ వ్యవహారంపై స్టే విధించలేమని సీబీఐ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది. ఫిబ్రవరి 29న.. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది.
సంబంధిత కథనం