YS Sharmila: వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
ys sharmila comments: వైఎస్ఆర్టీపీ అధినేతి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని వ్యాఖ్యానించారు.
ys sharmila sensational comments: వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని అన్నారు. తనని కూడా చంపేందుకు కుట్ర చేస్తున్నారన్న ఆమె... బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఆదివారం వనపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆమె... బేడీలను చూపించారు. ఈ బేడీలు తనని ఆపలేవని స్పష్టం చేశారు. తాను పులి బిడ్డను అన్న షర్మిల... భయం అంటే తెలియదన్నారు. టీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కేసీఆర్ కు ఒకటే మాట చెబుతున్నాను. నాకు బేడీలు అంటే భయం లేదు. దమ్ముంటే అరెస్ట్ చేయండి. గుర్తుపెట్టుకో కేసీఆర్.. నాపేరు వైఎస్ షర్మిల, రాజశేఖర్ రెడ్డి బిడ్డను.. పులిబిడ్డను. నాకు భయమా..? బేడీలు నన్ను ఆపుతాయా..? వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు. నన్ను కూడా చంపొచ్చు. ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి వేరు చేయటం ఎవరితరం కాదు. అవినీతి పాలన గురించి ప్రశ్నిస్తున్న నా గొంతు నొక్కడం ఎవరి తరం కాదు. పోలీసులను పంపండి. దమ్ముంటే అరెస్ట్ చేయండి. మీతో పోలీసులు ఉంటే నాతో ప్రజల ఉన్నారు. నేను జనం కోసం పోరాడుతున్నాను. ఫిర్యాదులు ఇచ్చారు.. కేసులు పెట్టారు. నేను రెడీ.. అరెస్ట్ చేయండి' అంటూ షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు.
అవినీతి పై మాట్లాడితే అంత వణుకు ఎందుకు?’’ అని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్ర ఆపేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నిరంజన్ రెడ్డిది నోరా? మోరినా? అని ఫైర్ అయ్యారు. నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు
మరోవైపు షర్మిల చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశంగా మారాయి. రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని అనటం వెనక ఏ పార్టీని టార్గెట్ చేశారనే దానిపై చర్చ నడుస్తోంది.ఈ కామెంట్స్ పై కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారింది.
సంబంధిత కథనం