RRR: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ పక్కా.. బాలీవుడ్ దర్శకుడి ఆసక్తికర కామెంట్స్-bollywood director anurag kashyap thinks rrr movie has 99 percent chance getting nominated for oscar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bollywood Director Anurag Kashyap Thinks Rrr Movie Has 99 Percent Chance Getting Nominated For Oscar

RRR: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ పక్కా.. బాలీవుడ్ దర్శకుడి ఆసక్తికర కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Aug 16, 2022 06:19 AM IST

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ఆర్ఆర్ఆర్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడానికి 99 శాతం ఛాన్స్ ఉందని జోస్యం చెప్పారు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్‌ను అందుకుంది.

ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ (Twitter)

దర్శకు ధీరుడు రాజమౌళి ప్రతిభ బాహుబలితో పాన్ఇండియా స్థాయిలో తెలిసింది. కానీ ఆర్ఆర్ఆర్‌తో ఆయన స్టామినా ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. హాలీవుడ్ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వ ప్రతిభ, ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు నీరాజనాలు పట్టారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రంపై హాలీవుడ్ సెలబ్రెటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని జోస్యం చెబుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా చేరిపోయారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడానికి 99 శాతం ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు.

"భారత్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అకాడమీకి ఎంపిక చేసినట్లయితే ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అవ్వడానికి 99 శాతం ఛాన్స్ ఉంది. ప్రపంచ సినిమాకు అంతగా ప్రభావితం చేసిందీ చిత్రం." అని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పష్టం చేశారు.

ఈ సినిమా విడుదలై దాదాపు ఐదు నెలలు కావస్తున్నా.. ఇంకా క్రేజ్ తగ్గలేదు. హాలీవుడ్ ప్రేక్షకుల కోసం చిత్రబృందం రిరీలీజ్ కూడా చేయగా.. నెట్‌ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ విడుదల చేసింది. ఆగస్టు 14 నుంచి బుల్లితెరపై కూడా ప్రసారం చేసింది. ఎన్ని సార్లు చూసినా, ఎంతగా పొగిడినా ఈ చిత్రం క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం