NTR: ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఫిదా అయినా డాక్ట‌ర్‌స్ట్రేంజ్ డైరెక్ట‌ర్‌...ఆర్ఆర్ఆర్ పై ప్ర‌శంస‌లు..-doctor strange director scott derrickson praises rrr is an amazing movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr: ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఫిదా అయినా డాక్ట‌ర్‌స్ట్రేంజ్ డైరెక్ట‌ర్‌...ఆర్ఆర్ఆర్ పై ప్ర‌శంస‌లు..

NTR: ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఫిదా అయినా డాక్ట‌ర్‌స్ట్రేంజ్ డైరెక్ట‌ర్‌...ఆర్ఆర్ఆర్ పై ప్ర‌శంస‌లు..

HT Telugu Desk HT Telugu
Jul 17, 2022 11:44 AM IST

ఆర్ఆర్ఆర్ పై(rrr) డాక్ట‌ర్ స్ట్రేంజ్ డైరెక్ట‌ర్ స్కాట్ డెరిక్‌స‌న్‌( scott derrickson)ప్ర‌శంస‌ల్ని కురిపించాడు. అమెజింగ్ మూవీ ఇదని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ (ntr) యాక్టింగ్ కు ఫిదా అయ్యాడు. స్కాట్ డెరిక్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఎన్టీఆర్
ఎన్టీఆర్ (twitter)

రాజ‌మౌళి (ss rajamouli)ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాపై అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అంటూ ప‌లువురు హాలీవుడ్ ప్ర‌ముఖులు చెబుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ యాక్టింగ్‌కు ఇంప్రెస్ అవ్వ‌డ‌మే కాకుండా వారితో సినిమా చేయాల‌నుందంటూ పేర్కొంటున్నారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి టేకింగ్ ను అభినందిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో డాక్ట‌ర్ స్ట్రేంజ్ డైరెక్ట‌ర్ స్కాట్ డెరిక్‌స‌న్‌ కూడా చేరిపోయాడు. ఆర్ఆర్ఆర్ అమేజింగ్ మూవీ అని పేర్కొన్నాడు. త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా భార్యాపిల్ల‌లతో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమా చూశాన‌ని స్కాట్ డెరిక్‌స‌న్‌ చెప్పాడు. రోల‌ర్ కోస్ట‌ర్ రైడ‌ర్‌గా సినిమా సరికొత్త అనుభూతిని పంచింద‌ని చెప్పాడు. ఇంట్రావెల్ బ్లాక్‌కు ముందు క్రూర‌మృగాల‌తో క‌లిసి ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ సినిమాకు హైలైట్‌గా నిలిచింద‌ని పేర్కొన్నాడు. ఈ సీన్ తనను భయపెట్టిందని చెప్పాడు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంద‌ని తెలిపాడు.

ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ తాలూకు స్ర్కీన్‌షాట్‌ను స్కాట్ డెరిక్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. అత‌డి ట్వీట్‌ను ఆర్ఆర్ఆర్ యూనిట్ షేర్ చేసింది. డాక్ట‌ర్ స్ట్రేంజ్ డైరెక్ట‌ర్‌గా త‌మ సినిమా న‌చ్చ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పింది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటీష‌ర్ల‌పై పోరాటాన్ని సాగించిన ఇద్ద‌రు యోధుల క‌థ‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌(ramcharan),కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్