RC15: హైదరాబాద్‌లో రామ్‌చరణ్‌ మూవీ షూటింగ్‌.. ఎక్కడో తెలుసా?-ramcharan shooting in hyderabad for his next movie rc15 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ramcharan Shooting In Hyderabad For His Next Movie Rc15

RC15: హైదరాబాద్‌లో రామ్‌చరణ్‌ మూవీ షూటింగ్‌.. ఎక్కడో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 07:00 PM IST

RC15: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నెక్ట్స్‌ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతానికి ఆర్సీ15గా పిలుస్తున్న ఈ మూవీకి ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఆర్సీ15లో రామ్ చరణ్
ఆర్సీ15లో రామ్ చరణ్ (Twitter)

ట్రిపుల్‌ ఆర్‌ సక్సెస్‌ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన రామ్‌చరణ్‌ ఇప్పుడు మరో భారీ సినిమా చేస్తున్నాడు. ఎన్నో సూపర్‌ హిట్‌ మూవీస్‌ అందించిన డైరెక్టర్‌ శంకర్‌తో చెర్రీ సినిమా అనగానే ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఈ మూవీలో అతని లుక్‌ చూసి వాళ్లు మరింత సంబరపడి పోయారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అన్న ఆతృతలో ఉన్నారు.

అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఆర్సీ15 మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌లో ఈ సినిమా షూట్‌ చేస్తున్నారు. అయితే ఇందులో మూవీ హీరోయిన్ కియారా అద్వానీ ఉందా లేదా అన్నది మాత్రం తెలియలేదు. ప్రస్తుతానికి ఆర్సీ 15గా పిలుస్తున్నా.. ఈ సినిమాకు అధికారి అనే టైటిల్‌ పెట్టనున్నారన్న వార్తలు ఆ మధ్య వచ్చాయి.

అయితే దీనిపై మేకర్స్‌ నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ రాలేదు. మరోవైపు ఈ సినిమా కోసం రామ్‌చరణ్‌పై భారీ స్థాయిలో ఓ సాంగ్‌ను షూట్‌ చేయనున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. ఈ పాటను గణేష్‌ ఆచార్య కొరియోగ్రాఫ్‌ చేస్తున్నాడు. ఇందులో 400 మంది డ్యాన్సర్లు పాల్గొననుండటం విశేషం. కాలేజ్ థీమ్‌లో సాగే ఈ పాటలో చెర్రీ ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.

ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో రామ్‌చరణ్‌ డ్యుయల్‌ రోల్‌లో నటించనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అమృత్‌సర్‌, వైజాగ్‌లలో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఆర్సీ 15 ప్రస్తుతం హైదరాబాద్‌ షెడ్యూల్‌లో ఉంది. ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్‌ జెర్సీ మూవీ డైరెక్టర్‌ గౌతమ్‌తో మరో మూవీ చేయనున్నాడు. ఈ సినిమాను ఆర్సీ 16గా పిలుస్తున్నారు.

IPL_Entry_Point