Alia Bhatt in SSMB29: మహేష్‌ బాబు సరసన ఆలియా.. రాజమౌళితో రెండో మూవీ!-alia bhatt in ssmb29 is official says film critic umair sandhu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Alia Bhatt In Ssmb29 Is Official Says Film Critic Umair Sandhu

Alia Bhatt in SSMB29: మహేష్‌ బాబు సరసన ఆలియా.. రాజమౌళితో రెండో మూవీ!

HT Telugu Desk HT Telugu
Sep 16, 2022 11:31 AM IST

Alia Bhatt in SSMB29: మహేష్‌ బాబు సరసన ఆలియాభట్‌ నటిస్తోంది. రాజమౌళితో ఆమె ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రెండో మూవీ చేయబోతోంది. ఇది అఫీషియల్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో ఆలియా భట్
బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో ఆలియా భట్ (AFP)

Alia Bhatt in SSMB29: బ్రహ్మాస్త్ర మూవీ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌. భర్త రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు సృష్టిస్తుండటంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడామె టాలీవుడ్‌లో మరో సినిమా చేయబోతోందని, అది కూడా తనకు ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి సూపర్‌ హిట్‌ అందించిన రాజమౌళితోనే అంటూ వార్తలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇన్నాళ్లూ పుకార్లుగా ఉన్న ఈ వార్తలు ఇప్పుడు అధికారికమయ్యాయంటూ ఫిల్మ్‌ క్రిటిక్‌, ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమేర్‌ సంధు ఓ ట్వీట్‌ చేశాడు. "అధికారికంగా ధృవీకరించారు. మహేష్‌బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీలో నటించడానికి ఆలియా భట్‌ అంగీకరించింది. ఎస్‌ఎస్‌ఎంబీ29 షూటింగ్‌ ఆలియా ప్రసవించిన తర్వాత ప్రారంభమవుతుంది" అని ఉమేర్‌ ట్వీట్‌ చేయడం విశేషం.

ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆలియా తొలిసారి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడదే రాజమౌళితో మరో సినిమా చేయడానికి ఆలియా అంగీకరించింది. మహేష్‌ బాబు సరసన ఆమె నటించనుండటం ఆసక్తి రేపుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో రామ్‌చరణ్‌కు జోడీగా ఆమె సీతగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంది. ఈ విషయంలోనే ఆమె రాజమౌళిపై అసంతృప్తిగా ఉందని, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అన్‌ఫాలో అయిందన్న పుకార్లు వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధమని తర్వాత తేలింది. ఇప్పుడిక అదే రాజమౌళితో ఆలియా మరో సినిమా చేస్తుండటం విశేషం.

ఆలియా భట్‌ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అన్న విషయం తెలిసిందే. గర్భవతిగా ఉంటూ ఆమె తన లేటెస్ట్‌ మూవీ బ్రహ్మాస్త్ర కోసం తన భర్త, ఆ మూవీ హీరో రణ్‌బీర్‌తో కలిసి ప్రమోషన్లలో పాల్గొంది. ఇక ఇటు మహేష్‌ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్‌ మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ28 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని త్రివిక్రమ్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత అతడు రాజమౌళితో సినిమాను మొదలుపెట్టనున్నాడు.

ఎస్‌ఎస్‌ఎంబీ29 గురించి..

ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరెస్‌గా తెరకెక్కబోతుందట. ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా వెల్లడించాడు. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న అతడు.. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరెస్‌గా ఉండబోతుందని తెలిపాడు. పాన్ఇండియా స్థాయిలో కేఎల్ నారాయణ ఈ సినిమా నిర్మించనున్నాడు.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు కోసం రెండు కథలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి అమెజాన్ అడవులలో నిధి వేట నేపథ్యంలో ఉండగా.. జేమ్స్ బాండ్ తరహాలో ఓ యాక్షన్ అడ్వెంచర్ కథగా మరొకటి ఉండనున్నట్లు సమాచారం. మరి వీటిలో ఏ కథ పట్టాలెక్కుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.