SS Rajamouli Remuneration: బ్రహ్మాస్త్ర ప్రమోషన్‌కు రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!-as per the reports ss rajamouli take rs 10 crores for brahmastra promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  As Per The Reports Ss Rajamouli Take <Span Class='webrupee'>₹</span>10 Crores For Brahmastra Promotions

SS Rajamouli Remuneration: బ్రహ్మాస్త్ర ప్రమోషన్‌కు రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Maragani Govardhan HT Telugu
Sep 13, 2022 06:23 AM IST

Rajamouli remuneration for Brahmastra: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఇందుకోసం మన జక్కన్న బ్రహ్మాస్త్ర మేకర్స్ నుంచి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

బ్రహ్మాస్త్ర చిత్రానికి రాజమౌళి రెమ్యూనరేషన్
బ్రహ్మాస్త్ర చిత్రానికి రాజమౌళి రెమ్యూనరేషన్ (Twitter)

Rajamouli Payment for Brahmastra: దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ఇండియా కాదు.. ఏకంగా పాన్‌వరల్డ్ డైరెక్టర్ అయిపోయారనేది వాస్తవం. హాలీవుడ్, పాశ్చాత్య ప్రేక్షకుల నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రానికి వచ్చిన స్పందన చూస్తేనే ఈ విషయం తెలుస్తుంది. దీంతో ఆయనకు ఫాలోయింగ్ కూడా బీభత్సంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్రహ్మాస్త్ర మేకర్స్ రాజమౌళిని ఆ సినిమా తెలుగు వెర్షన్‌కు సమర్పకులుగా వ్యవహరించేందుకు ఒప్పించారు. ఇది కాకుండా.. సినిమా ప్రచారంలో భాగమయ్యేలా చేశారు. ఇందుకు మన జక్కన్న కూడా బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో చురుకుగా పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు, స్పెషల్ వీడియోల ద్వారా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేశారు.

తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ ప్రచారానికి రాజమౌళికి భారీ మొత్తంలో పారితోషికాన్ని మేకర్స్ అప్పజెప్పారాని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణ్‌జోహార్ చిత్ర ప్రమోషన్‌ కోసం రాజమౌళికి రూ.10 కోట్లు ముట్టజెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాను రూ.410 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మాస్త్ర చిత్రం మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంది. విజువల్, యాక్షన్ వండర్‌గా సినిమా రూపొందించినప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లేతో దర్శకత్వంలో ఎలాంటి వైవిధ్యం లేదని ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా బ్రహ్మాస్త్ర జోరు మాత్రం తగ్గలేదు. వీకెండ్‌కే ఈ సినిమాకు వంద కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది.

బ్రహ్మాస్త్ర చిత్రాన్ని ప్రతిష్టాత్మంగా తెరకెక్కించారు. గత వారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం జరగలేదు. అనంతరం కొన్నిగంటల్లోనే చిత్రబృందం విలేకరుల సమావేశం నిర్వహించి విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశానికి జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కూడా రావడం గమనార్హం.

రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ తొలిసారిగా కలిసి నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాల ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు అయ్యన్ ముఖర్జి తెరకెక్కించారు. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రలకు సంబంధించిన పురాణ గాథలు, వాటి శక్తిని గురించి ఈ సినిమాలో వివరించే ప్రయత్నం చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.