Rajamouli Movies from Tollywood to Hollywood: తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం.. హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రాజమౌళి
Rajamouli From Tollywood to Hollywood: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, బాహుబలి రెండు భాగాలు, ఈగ, మర్యాద రామన్న, మగధీర చిత్రాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి.
From Tollywood to Hollywood: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఒక్కటంటే ఒక్క పరాజయం కూడా లేకుండా.. దిగ్విజయ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. మగధీరతో టాలీవుడ్‌లో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసిన మన జక్కన్న.. బాహుబలితో పాన్ఇండియా డైరెక్టర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో అత్యుత్తమ దర్శకుడు ఎవరు అంటే.. సందేహం లేకుండా సగర్వంగా రాజమౌళి పేరు చెప్పుకునేలా తన సత్తా చాటారు. తాజాగా మరో అరుదైన ఘనతను అందుకోనున్నారు మన జక్కన్న. ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ పెస్టివల్ బియాండ్ ఫీస్ట్ అనే అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో రాజమౌళి సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.
బియాండ్ ఫీస్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రతి ఏటా సెప్టెంబరు లేదా అక్టోబరు మధ్య కాలంలో అమెరికా లాస్ ఏంజెల్స్ వేదికగా నిర్వహిస్తారు. ఇక్కడ వందలాది సినిమాలు ప్రదర్శితమవుతాయి. అత్యధిక చిత్రాలను ప్రదర్శించే ఫిల్మ్ ఫెస్టివల్‌లో బియాండ్ ఫీస్ట్ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఏడాది పదో వార్షికోత్సవం సందర్భంగా.. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి రెండు భాగాలు, ఆర్ఆర్ఆర్ చిత్రాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 23 వరకు ఈ స్క్రీనింగ్ జరగనుంది.
అక్టోబరు 1న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మారథాన్‌లో రాజమౌళీ కూడా పాల్గొననున్నారు. అనంతరం ప్రేక్షకులకులతో ఇంటరాక్ట్ అవ్వడమే కాకుండా ఈ సినిమాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను కూడా ఇవ్వనున్నారు. ఫ్రమ్ టాలీవుడ్ టూ హాలీవుడ్(From Tollywood to Hollywood) పేరుతో ఈ సినిమాల స్క్రీనింగ్ జరగనుంది. ఈ కింది థియేటర్లలో రాజమౌళి చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి.
ఆర్ఆర్ఆర్- సెప్టెంబరు 30- టీసీఎల్ చైనీస్ థియేటర్ ఐమాక్స్
ఈగ, బాహుబలి-1, బాహుబలి-2- సెప్టెంబరు 30 - MUBI థియేటర్, ఏయిరో
మగధీర- అక్టోబరు 21 - MUBI థియేటర్, ఎయిరో
మర్యాద రామన్న- అక్టోబరు 23- MUBI థియేటర్, ఎయిరో.
ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను బుక్ మై షో యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ప్రతి ఏటా జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎన్నో చిత్రాల ప్రదర్శితమవుతాయి. ఈ ఏడాది 10వ వార్షికోత్సవం కావున.. బియాండ్ ఫీస్ట్ వేడుకలో అమెరికన్ సినిమాథెఖ్, ఐమాక్స్, వేరియన్స్ ఫిల్మ్, పొటెంటేట్ ఫిల్మ్, లాస్ ఏంజెల్స్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ భాగమయ్యాయి.
సంబంధిత కథనం