RRR Movie: ఆర్ఆర్ఆర్‌కు అరుదైన ఘనత.. ఏ హాలీవుడ్ చిత్రానికి దక్కని రికార్డు-rrr is the only movie to trend globally in netflix for 14 consecutive weeks ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr Is The Only Movie To Trend Globally In Netflix For 14 Consecutive Weeks

RRR Movie: ఆర్ఆర్ఆర్‌కు అరుదైన ఘనత.. ఏ హాలీవుడ్ చిత్రానికి దక్కని రికార్డు

Maragani Govardhan HT Telugu
Aug 24, 2022 01:33 PM IST

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 14 వారాల నుంచి ట్రెండ్ అవుతున్న ఏకైక సినిమాగా ఈ చిత్రం గుర్తింపు తెచ్చుకుంది.

ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ (Twitter)

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. పాన్ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ.. హాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుందీ చిత్రం. థియేటర్లోనే కాకుండా ఓటీటీ వేదికగా కూడా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. ఏ ఇంగ్లీష్, నాన్ ఇంగ్లీష్ సినిమాలకు దక్కని రికార్డును సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై 14 వారాలైన ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది.

ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే చివర్లోనే విడుదలైంది. అయితే ఇప్పటికీ ఇంకా ట్రెండింగ్‌లోనే ఉందీ సినిమా. వరుసగా 14 వారాల పాటు ఎక్కువ మంది ఆదరిస్తున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ ట్విటర్ హ్యాండిల్ అధికారికంగా ప్రకటించింది.

"ఆంగ్ల, ఆంగ్లేతర కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న ఏకైక సినిమా అని చెప్పేందుకు ఎంతో సంతోషంగా ఉంది. వరుసగా 14 వారాల నుంచి ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది." అని ఆర్ఆర్ఆర్ ట్విటర్ వేదికగా తెలిపింది. ఈ సినిమా విడుదలై దాదాపు ఐదు నెలలు కావస్తున్నా.. ఇంకా క్రేజ్ తగ్గలేదు. హాలీవుడ్ ప్రేక్షకుల కోసం చిత్రబృందం రిరీలీజ్ కూడా చేయగా.. నెట్‌ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ విడుదల చేసింది.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం