Alia Bhatt: బేబీ బంప్‌తో ఆలియా.. గులాబీ రంగు డ్రెస్‌లో మెరిసిన ముద్దుగుమ్మ-alia bhatt glows in pink dress with baby bump ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Alia Bhatt Glows In Pink Dress With Baby Bump

Alia Bhatt: బేబీ బంప్‌తో ఆలియా.. గులాబీ రంగు డ్రెస్‌లో మెరిసిన ముద్దుగుమ్మ

Maragani Govardhan HT Telugu
Aug 26, 2022 03:12 PM IST

ఆలియా భట్ మరోసారి బేబీ బంప్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర చిత్ర ప్రచారాల్లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ.. బేబీ బంప్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది.

బేబీ బంప్‌తో ఆలియా భట్.. పక్కన ఆమె భర్త రణ్‌బీర్
బేబీ బంప్‌తో ఆలియా భట్.. పక్కన ఆమె భర్త రణ్‌బీర్ (HT)

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. ఈ ఏడాది ఏప్రిల్‍‌‌‌లో రణ్‌బీర్ కపూర్‌తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ జోడీ పెళ్లయిన కొద్ది రోజులకే శుభవార్త కూడా చెప్పేసింది. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అయితే అప్పటి నుంచి ఆలియా.. తన బేబీ బంప్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి తన సరికొత్త ప్రెగ్నెన్సీ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రాల్లో గులాబీ రంగు డ్రెస్‌లో అత్యంత ప్రకాశవంతంగా కనిపించింది.

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. లైట్‌ను స్వాగతించడానికి మరో రెండు వారాల దూరంలో ఉందని చెప్పింది. తన భర్త.. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆలియా నటించిన మొదటి చిత్రం బ్రహ్మాస్త్ర సరిగ్గా రెండు వారాల్లో అంటే సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ కొత్త చిత్రాలను ఆలియా తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇందులో ఆమె పింక్ టాప్‌పై నలుపు రంగు షర్ట్ ధరించి, వాటిని బ్లాక్ లెగ్గింగ్‌తో జత చేసింది. రెండో ఫొటోలో క్లోజప్‌లో తన గంభీరమైన రూపంతో కూడిన చిత్రాన్ని షేర్ చేసింది.

లైట్ వస్తుంది అంటూ ఆలియా ఈ ఫొటోలకు క్యాప్షన్ జత చేసింది. సెప్టెంబరు 9న బ్రహ్ర్మాస్త్ర రానున్నట్లు కూడా ఇందులో మెన్షన్ చేసింది ఆలియా. ఈ చిత్రంలో రణ్‌బీర్ సరసన ఇషా అనే పాత్రలో నటించింది ఆలియా.

అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. సౌత్‌లో ఈ చిత్రాన్ని రాజమౌళితో కలిసి రణబీర్ ఇటీవల చెన్నైలో చిత్ర ప్రమోషన్ల కోసం వచ్చారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. అయ్యన్ ముఖర్జి దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు భాగాలుగా విడుదల కానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం